ఆస్కార్ నామినేషన్ పై గ్లోబల్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్!
కమర్శియల్ చిత్రాలు డబ్బు తెచ్చి పెడితే అవార్డు విన్నింగ్ చిత్రాలు దేశానికి పేరుప్రఖ్యాతలు తెచ్చి పెడతాయి.
By: Tupaki Desk | 17 Jan 2025 5:57 AM GMTకమర్శియల్ చిత్రాలు డబ్బు తెచ్చి పెడితే అవార్డు విన్నింగ్ చిత్రాలు దేశానికి పేరుప్రఖ్యాతలు తెచ్చి పెడతాయి. కోట్లాది మందిని కేవలం సందేశాత్మక చిత్రాలు మాత్రమే ప్రభావితం చేస్తాయి. సమాజంలో అసమానతలు, పరిస్థి తులు, సమస్యలను కళ్లకు కట్టిన చిత్రమే `అనుజ`. అందుకే ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు బరిలో నిలిచింది. లైవ్ యాక్షన్ షార్ట్ కేటగిరిలో అకాడమీ ఎంపిక చేసిన టాప్ 10 చిత్రాల్లో అనుజ చోటు దక్కించుకుంది.
ఇప్పటికే అమెరికాలో ప్రదర్శితమైన చిత్రం త్వరలోనే ఓటీటీలోనూ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నిర్మాణంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా భాగమవ్వడం మరో విశేషం. ఆస్కార్ కి నామినేట్ అయిన నేపథ్యంలో ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. `అమెరికా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ దీన్ని ప్రదర్శించగా కొన్నింట్లో విజేతగానూ నిలిచింది.
ఇలాంటి సినిమా నిర్మాణంలో భాగమైనందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న ఎంతో మంది చిన్నారుల్ని ప్రభావితం చేస్తుంది. మనం తీసుకున్న నిర్ణయాలు వర్తమానం, భవిష్యత్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథలో కనిపిస్తుంది` అని అన్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఢిల్లీకి చెందిన అనుజ అనే తొమ్మిదేళ్ల బాలకది నిరూపేద కుటుంబం. చదువుకునే స్తోమత లేక అక్కతో కలిసి ఓ వస్త్రాల దుకాణం లోపని చేస్తుంది.
అయినా చదువుకోవాలనే పట్టుదల తనలో ఉం టుంది. ఈ క్రమంలో పాఠశాల, చదువు గురించి తరుచూ అక్కను అడుగుతుంది. ఆ విషయాలు తెలియడంతో స్కూల్ కి వెళ్లాలి? అన్న ఆసక్తి మరింత పెరుగగుతుంది. కానీ పరిస్థి తులు కారణంగా స్కూల్ కి వెళ్లాలా? పని చేయాలా? అన్న సందిగ్దం వెంటాడుతుంది. ఈ క్రమంలోనే అనుజకు చదు వుకునే అవకాశం ఓ రూపంలో దక్కుతుంది. ఈ చిత్రాన్ని ఆడమ్ జె. గ్రేవ్స్ తెరకెక్కించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ప్లిక్స్ దక్కించుకుంది.