Begin typing your search above and press return to search.

SSMB 29: ప్రియాంకకు రూ.30 కోట్లా? ఫ్యాన్స్ ఏమంటున్నారు?

అయితే కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. SSMB 29 ప్రాజెక్ట్ కు గాను ప్రియాంక.. రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Feb 2025 6:46 AM GMT
SSMB 29: ప్రియాంకకు రూ.30 కోట్లా? ఫ్యాన్స్ ఏమంటున్నారు?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా, అటవీ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న SSMB 29 ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు గత ఏడాది చివర్లో చాలా సీక్రెట్ గా జరిగాయి.

రీసెంట్ గా మహేష్ బాబు పాస్‌ పోర్ట్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా, రాజమౌళి వీడియోను షేర్‌ చేయడంతో షూటింగ్‌ కూడా మొదలు పెట్టినట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఆ మూవీకి సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా జక్కన్న ఎంతో జాగ్రత్త పడుతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాకుండా సినిమాలో నటించే వాళ్ల వివరాలు కూడా బయటకు రావడం లేదు. ప్రియాంక పేరు అధికారికంగా ప్రకటించకపోయినా.. రాజమౌళి పోస్టుకు ఆమె పెట్టిన కామెంట్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి షేర్ చేసిన పాస్ పోర్ట్ వీడియోకు ఫైనల్లీ అంటూ ప్రియాంక కామెంట్ పెట్టిన విషయం తెలిసిందే.

అయితే కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. SSMB 29 ప్రాజెక్ట్ కు గాను ప్రియాంక.. రూ.30 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రియాంక అత్యధిక పారితోషికం తీసుకుంటున్న భారతీయ నటిగా రికార్డు సృష్టించిందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ఫుల్ గా రెస్పాండ్ అవుతున్నారు. నిజానికి హాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక.. 10 ఏళ్ల నుంచి బాలీవుడ్ కు దూరంగా ఉంది. చివరిగా 2015లో బాజీరావ్ మాస్తానీతో సందడి చేసింది. కానీ ఆమెకు ఇక్కడ సూపర్ స్టార్ డామ్, ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ మాత్రం ఉంది.

కానీ మహేష్ ఫ్యాన్స్.. ఆమె హీరోయిన్ గా తీసుకోవడం అవసరమా అని ఇప్పటికే జక్కన్నను ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రాజమౌళి మార్క్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నచ్చజెప్పుకుంటున్నారు. ఇప్పుడు రూ.30 కోట్ల రెమ్యునరేషన్ విషయం మాత్రం నిజం కాదని అంటున్నారు. అదేదో పీఆర్ స్టంట్ లా అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఆమెకు అంత ఇవ్వడం అవసరం లేదని కూడా చెబుతున్నారు. మరి ప్రియాంక రెమ్యునరేషన్ వార్తల్లో నిజమెంత ఉందో వేచి చూడాలి.