Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రా 4 లగ్జరీ అపార్ట్‌మెంట్‌ల అమ్మ‌కం

ఇంత‌లోనే ప్రియాంక చోప్రా త‌న ముంబై ఆస్తుల అమ్మ‌కం గురించిన స‌మాచారం అందింది.

By:  Tupaki Desk   |   7 March 2025 12:02 PM IST
ప్రియాంక చోప్రా 4 లగ్జరీ అపార్ట్‌మెంట్‌ల అమ్మ‌కం
X

గ్లోబ‌ల్ ఐక‌న్ ప్రియాంక చోప్రా జోనాస్ భ‌ర్త నిక్ జోనాస్ తో కలిసి అమెరికాలో నివ‌శిస్తున్న సంగ‌తి తెలిసిందే. హాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూనే, ప్ర‌స్తుతం భార‌తీయ సినిమాల్లో న‌టించేందుకు ముంబైలో అడుగుపెట్టింది. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో త‌న తాజా సినిమా చిత్రీక‌ర‌ణ కోసం బ‌స చేసింది. మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ లోని ఎస్.ఎస్.ఎం.బి 29 చిత్రంలో పీసీ న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగుల కోసం జ‌క్క‌న్న టీమ్ తో బిజీగా ఉంది పీసీ.

ఇంత‌లోనే ప్రియాంక చోప్రా త‌న ముంబై ఆస్తుల అమ్మ‌కం గురించిన స‌మాచారం అందింది. ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని నాలుగు హై ఎండ్ అపార్ట్‌మెంట్‌లను మొత్తం రూ.16.17 కోట్లకు సేల్ చేసింద‌ని ప్ర‌ఖ్యాత `ఇండెక్స్‌ట్యాప్` వివ‌రాలు వెల్ల‌డిస్తున్నాయి. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లో ఉన్న భారీ భ‌వంతిలో 18వ అంతస్తులో రెండు ఫ్లాట్లు, 19వ అంతస్తులో ఒక ఫ్లాట్ ని క‌లిపి విక్ర‌యించార‌ని తెలుస్తోంది.

18వ అంతస్తులోని 1,075 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ.3.45 కోట్లకు అమ్మేశారు. ఒక పార్కింగ్ స్థలం సహా ఈ అపార్ట్ మెంట్ కోసం రూ.17.26 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. అదే అంతస్తులో మరో 885 చదరపు అడుగుల యూనిట్ రూ.2.85 కోట్లు పలిక‌గా, రూ.14.25 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. మూడో అపార్ట్ మెంట్ ధ‌ర సుమారు 9కోట్లు ఉంటుంద‌ని స‌మాచారం. ఓవ‌రాల్ గా మూడు అపార్ట్ మెంట్లు క‌లిపి 16.17 కోట్లు ప‌లికాయి.