Begin typing your search above and press return to search.

క‌ఠిన‌మైన షెడ్యూళ్ల‌తో పీసీ తంటాలు

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ పైరేట్ అడ్వెంచర్ మూవీ చేసేటప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడింది.

By:  Tupaki Desk   |   31 Aug 2024 2:45 AM GMT
క‌ఠిన‌మైన షెడ్యూళ్ల‌తో పీసీ తంటాలు
X

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా వ‌రుస‌గా హాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల ముంబైలో త‌న సోద‌రుడి నిశ్చితార్థ కార్య‌క్ర‌మానికి ఎటైండైంది. అంత‌కుముందు తన కొత్త హాలీవుడ్ చిత్రం `ది బ్లఫ్` చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ చిత్రానికి ఫ్రాంక్ ఇ.ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్ల్ అర్బన్ స‌హ‌న‌టుడు. ఈ సినిమా సెట్స్ లో తీవ్రంగా గాయ‌ప‌డిన కొన్ని ఫోటోల‌ను షేర్ చేసిన పీసీ పెద్ద షాకిచ్చింది. ఇప్ప‌టికే ముఖం అంతా గాయాలైన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. చిత్రీకరణ సమయంలో ప్రియాంక తన కష్టాలు, గాయాలు, సినిమా సెట్‌లను చూపించే అనేక తెరవెనుక ఫోటోలను తాజాగా మ‌రోసారి షేర్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ పైరేట్ అడ్వెంచర్ మూవీ చేసేటప్పుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడింది.

ప్రియాంక చోప్రా `ది బ్లఫ్‌` కోసం క్రూరమైన షెడ్యూల్ లో పాల్గొన్నాన‌ని వెల్లడించింది. వారానికి 6రోజులు.. రోజుకు 12 గంటల రోజులు తీవ్రంగా శ్ర‌మించాన‌ని పీసీ తెలిపింది. కొన్నిసార్లు సెట్లో తీవ్ర గాయాల‌య్యాయ‌ని, ఒంట‌రిగా గ‌డ‌పాల్సొచ్చింద‌ని, చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాన‌ని కూడా పీసీ వెల్ల‌డించింది. సెట్‌లో తన గాయాల గురించి ప్రియాంక వోగ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్ల‌డించింది. సినిమా సెట్స్‌లో తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. చిత్రీకరణ సమయంలో తాను గాయపడ్డానని తెలిపింది. నేను ఎల్లప్పుడూ ఇలాంటి దెబ్బ‌ల‌ను స‌హ‌జంగా భావించి ఆస్వాధించాను. కానీ మనిషి పెద్దయ్యాక క‌చ్చితంగా దాని ఫ‌లితాన్ని అనుభవిస్తారు. కోలుకోవడం అంత త్వరగా వీలుప‌డ‌దు అని పెరిగిన వ‌య‌సు గురించి గుర్తు చేసుకుంది.

రోజులు నిజంగా క‌ఠిన‌మైన‌వి.. తీవ్రమైనవి.. కానీ అదే సమయంలో హాస్యాస్పదంగా చాలా రొటీన్ గాను ఉంటాయి. నేను మే 2024 నుండి `ది బ్లఫ్` చిత్రీకరణలో ఉన్నాను. వారానికి ఆరు రోజులు పని చేసాను. నేను చాలా రోజులలో 4:30- 5.00 గంటల మధ్య మేల్కొన్నాను. 12 గంటలు పనిచేసాను.. ఇంటికి వెళ్లి రాత్రి భోజనం చేశాను.. నా కుమార్తెతో ఆడుకున్నాను.. మా అమ్మతో లేదా ఇతర పనిలో మునిగి అలాగే నిద్రపోయాను.. ఆపై మేల్కొన్నాను. మరుసటి రోజు అన్నింటినీ రిపీట్ చేసాను..! అంటూ త‌న రోజువారీ షెడ్యూల్ గురించి తెలిపింది.

కానీ ఆస్ట్రేలియాలో షూటింగ్ సమయంలో కొంత కుటుంబ సమయాన్ని గడిపానని వెల్లడించింది. తల్లి మ‌ధు చోప్రా, కుమార్తె మాల్తీ మేరీ తో పీసీ కలిసి ఉన్నారు. అయితే చిత్రీకరణ స‌మ‌యంలో చాలా కఠినంగా అనిపించింది. నేను ఒంటరిగా ఉన్న‌ట్టు అనిపించింద‌ని పీసీ తెలిపింది. నేను మేల్కొని ఉన్నప్పుడు నా కుటుంబం, స్నేహితులు, ఇత‌ర‌ బృందం నిద్రపోతున్నారు. నేను నిద్రిస్తున్నప్పుడు వారు మేల్కొని ఉన్నారు. ఇది మృగం స్వభావం.. నేను ఊహించ‌నిది.. అని పీసీ అన్నారు.

హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్ అనే రెండు సినిమాల‌తో పీసీ ఇటీవ‌ల బిజీగా ఉంది. హెడ్స్ ఆఫ్ స్టేట్‌లో ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా త‌దితరులతో క‌లిసి న‌టిస్తోంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వ‌హిస్తున్నారు.