Begin typing your search above and press return to search.

తండ్రితో అగ్ర‌న‌టి క‌ల‌హాలు.. స్కూల్‌లోను హేళ‌న‌లు..

అంతేకాదు కొన్ని విష‌యాల్లో త‌న తండ్రితో ఘ‌ర్ష‌ణ ప‌డేదానిన‌ని కూడా ప్రియాంక చోప్రా రిమైండ్ చేసుకుంది.

By:  Tupaki Desk   |   3 Jan 2025 11:30 PM GMT
తండ్రితో అగ్ర‌న‌టి క‌ల‌హాలు.. స్కూల్‌లోను హేళ‌న‌లు..
X

ఇంట్లో నాన్న స్ట్రిక్టుగా ఉంటే... ఆర్మీ కండీష‌న్స్ అప్ల‌య్ అని రూల్స్ రుద్ధితే పిల్ల‌ల జీవితం ఎంత క‌ఠినంగా మారుతుంది? తాను కూడా అలాంటి ప‌రిస్థితుల్లో జీవించాన‌ని, సైనికుడైన‌ త‌న తండ్రి పెట్టిన కండీష‌న్స్ కార‌ణంగా చిన్న‌త‌నంలో చాలా కోల్పోయాన‌ని ప్రియాంక చోప్రా తాజా ఇంట‌ర్వ్యూలో నిజాయితీగా మాట్లాడింది. ఇంట్లో క‌ట్టుబాట్లు ఎక్కువ‌. నాన్న ఆర్మీ అధికారి కావ‌డంతో ప్ర‌తిదీ స్ట్రిక్టుగా మారింది. ఇంటి ఎదురు టెర్రాస్ పై నుంచి ఒక కుర్రాడు మా బాల్క‌నీలోకి దూకడంతో నాన్న నా రూమ్ కిటికీల‌కు ఊచ‌లు బిగించారని, త‌లుపుల‌న్నిటికీ పెద్ద తాళాలు వేసార‌ని కూడా నాటి ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకుంది. అంతేకాదు కొన్ని విష‌యాల్లో త‌న తండ్రితో ఘ‌ర్ష‌ణ ప‌డేదానిన‌ని కూడా ప్రియాంక చోప్రా రిమైండ్ చేసుకుంది.


అలాగే త‌న కుటుంబీకులే త‌న రంగు (వ‌ర్ణం)ని ఆట ప‌ట్టిస్తూ `కాళీ` అని పిలిచేవార‌ని ప్రియాంక చోప్రా తెలిపింది. పీసీ పంజాబీ కుటుంబం నుంచి వ‌చ్చిన అమ్మాయి. త‌న కుటుంబంలోనే చాలా మంది కాళీ (న‌ల్ల‌న‌మ్మాయి) అంటూ స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించేవారు. చీక‌టి రంగులో ఉన్నావంటూ కించ‌ప‌రిచేవారు. ఇలాంటి కామెంట్లు యుక్త‌వ‌య‌సులోను ఎదుర‌య్యాయి. ఆ స‌మ‌యంలో ఇవ‌న్నీ న‌న్ను చాలా తీవ్రంగా ప్ర‌భావితం చేసాయ‌ని పీసీ తెలిపింది. త‌న కుటుంబంలోని వ్య‌క్తులే త‌న రంగును చూసి కామెంట్ చేసారు. చ‌దువుకునే చోట బ్రౌనీ, కూర‌ అంటూ కామెంట్ చేసేవారు. ఇలాంటి పేర్లతో పిలవడం వల్ల డైనింగ్ ఏరియాలో కాకుండా వాష్‌రూమ్‌లో తినవలసి వచ్చిందని కూడా తెలిపింది. ఇవ‌న్నీ త‌న‌ను మాన‌సికంగా తీవ్రంగా ప్ర‌భావితం చేసాయని పీసీ తెలిపింది.

అయితే ఇలాంటి ఎన్నిటినో ఎదుర్కొని త‌న జీవితంలో అనుకున్న ల‌క్ష్యం దిశ‌గా ముందుకు సాగి పెద్ద స్టార్ గా ఎదిగింది పీసీ. నేడు గ్లోబ‌ల్ స్టార్ గా దేశీ గాళ్ గొప్ప గుర్తింపు ద‌క్కించుకుంది. బాలీవుడ్ టు హాలీవుడ్ ప్రియాంక చోప్రా పేరు మార్మోగింది. ఇప్పుడు మ‌హేష్ - రాజ‌మౌళి పాన్ వ‌ర‌ల్డ్ మూవీలో క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుందంటూ ప్ర‌చారం సాగుతోంది. సిటాడెల్ త‌ర్వాత భారీ పాన్ ఇండియ‌న్ సినిమాలో పీసీకి అవ‌కాశం వ‌చ్చిందంటూ ప్ర‌చారం ఉంది. పీసీ చాలా పోరాడితేనే కానీ ఇప్ప‌టి స్టార్ డ‌మ్ ని ఆనందాన్ని సాధించ‌లేక‌పోయింది. ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికీ ఏదీ సులువు కాదు అనేందుకు మాజీ ప్ర‌పంచ సుంద‌రి, గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా జీవిత‌మే ఒక ఎగ్జాంపుల్.

త‌న‌ను కాళీ (న‌ల్ల పిల్ల‌) అని పిలిచిన వారికి షాకిస్తూ ప్ర‌పంచ సుంద‌రి గా కిరీటం గెలుచుకుంది. బాలీవుడ్ లో ప్ర‌వేశించాక .. అంత‌గా అందంగా లేవ‌ని, రూపాన్ని మార్చుకోవాల‌ని.. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఉప‌యోగించాల‌ని కూడా స‌ల‌హాలిచ్చిన వారున్నారు. ఇలాంటి ప‌రిశ్ర‌మ‌లో న‌టిగా నిల‌దొక్కుకుని అసాధార‌ణ స్టార్ డ‌మ్ దిశ‌గా ప్ర‌యాణించింది. ఇప్పుడు ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేని క్వీన్ గా ఎదిగింది.