ట్రంప్ -నిక్ మధ్యలో పీసీ నలిగిపోతుంది!
ఈ సన్నివేశాన్ని చూసి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ లైన్ లోకి వచ్చాడు.
By: Tupaki Desk | 20 Dec 2024 8:30 PM GMTఅమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ గెలిచిని సంగతి తెలిసిందే. ట్రంప్ విజయంతో ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ లాభాలు పెరిగాయి. దీంతో మస్క్ కూడా రాజకీయ ఎంట్రీ ఇస్తున్నాడే ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన బెడితే తన కంపెనీ లాభాలు పెరగడం విషయంలో విషయాన్ని మస్క్ కూడా ధృవీకరించాడు. ఈ సన్నివేశాన్ని చూసి ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ లైన్ లోకి వచ్చాడు.
300 సంవత్సరాల పాటు మమ్మల్ని మీరే పాలించాలని అని ట్రంప్ కు సంపూర్ణ మద్దతు పలికాడు. అయితే నిక్ లో ఇలా ట్రంప్ కు మద్దతు పలకడం కొందరు ఇండియన్స్ నచ్చలేదు. దీంతో వారు సోషల్ మీడియా వేదికగా పీసీ నీ భర్తను అదుపులో పెట్టుకో అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నిక్ జోనాస్ పై ఇష్టాను సారం కామెంట్లు పెడు తున్నారు. ఈ వ్యవహారంతో పీసీకి ఎలాంటి సంబంధం లేదు.
తాను ఎలాంటి కామెంట్ చేయకపోయినా నిక్ తన భర్త కావడంతో? వాటిని భరించాల్సి వస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. మీరు ఎలాంటి కామెంట్ చేయాలనుకున్నా నేరుగా నిక్ ని ఉద్దేశించి మాట్లాడవచ్చు అంతే కానీ ఆ వివాదంలో ప్రియాంకను కావాలని లాగొద్దు అంటే విజ్ఞప్తి చేసారు. అయినా పోస్టులు మాత్రం కంట్రోల్ అవ్వలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో భర్తపై కామెంట్లు పెట్టడంతో ప్రియాంక మనసు బాధకు గురవుతుందని సన్నిహితులు తెలిపారు.
ఎంతైన భారతీయ మహిళ. అమెరికా కోడలైనా పుట్టి పెరిగింది ఇండియాలో. భర్తను అంటే ఏ భార్యకైనా కోప మోస్తుంది. బాధపడుతుంది. అయితే ఈ విషయంపై ప్రియాంక చోప్రా ఇంకా స్పందించలేదు. గ్లోబల్ స్టార్ వచ్చే ఏడాది ఇండియా కి రాబోతుంది. బాలీవుడ్ లో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.