Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : పింక్‌ డ్రెస్‌లో ప్రియాంక స్టన్నింగ్‌

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్‌.

By:  Tupaki Desk   |   24 Oct 2024 3:30 PM GMT
పిక్‌టాక్ : పింక్‌ డ్రెస్‌లో ప్రియాంక స్టన్నింగ్‌
X

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్‌. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావడం లేదు, వచ్చినా ఆఫర్లు దక్కడం లేదు అనుకుంటున్న సమయంలో వచ్చిన ఈ అనంతపురం అమ్మాయికి మొదటి సినిమాతోనే మంచి ఫలితం దక్కింది. స్టార్‌ హీరోలతో ఈ అమ్మడు నటిస్తుందని అంతా భావించారు. ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాకుండా ప్రియాంక జవాల్కర్ ఉందనే అభిప్రాయంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేయడంతో పాటు, సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌ దక్కింది.

టాక్సీవాలా సినిమా తర్వాత ఈ అమ్మడు చేసిన సినిమా తిమ్మరుసు. ఆ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చేసినా ఏ ఒక్కటి ఆమె కెరీర్‌ కి ఉపయోగపడలేదు. దాంతో ఆఫర్లు లేకుండా అయింది. ఈ ఏడాది టిల్లు స్క్వేర్‌ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్ ఇచ్చింది. అది కూడా ఈ అమ్మడికి పెద్దగా బ్రేక్ తెచ్చి పెట్టలేదు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఏమీ లేవు. అయితే రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో ఉండటం మాత్రమే కాకుండా, తెలుగు అమ్మాయి అవ్వడం వల్లే ఆఫర్లు రావడం లేదు పాపం అనే సానుభూతి పొందుతోంది.

తాజాగా మరోసారి అందమైన ఫోటోలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈసారి పింక్‌ క్రాప్‌ టాప్ లో నడుము అందం చూపిస్తూ క్లీవేజ్ షో తో మతి పోగొడుతుంది. అందమైన ఈ అమ్మడికి ముందు ముందు అయినా మరిన్ని ఆఫర్లు రావాలి అంటూ ఈ ఫోటోలు చూసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది ఉత్తరాది ముద్దుగుమ్మలతో పోల్చితే ప్రియాంక జవాల్కర్ చాలా చక్కగా, అందంగా ఉన్నారు. ఆమె ఫిజిక్‌ మొదలుకుని ప్రతి ఒక్కటి ఒక పక్కా కమర్షియల్‌ హీరోయిన్‌ లక్షణాలను కలిగి ఉంది. అయినా ఎందుకు ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రియాంక జవాల్కర్‌ ప్రస్తుతం చేస్తున్న సోషల్‌ మీడియా పోస్ట్‌ల కారణంగా తప్పకుండా భవిష్యత్తులో ఆఫర్లు వస్తాయని అంతా భావిస్తున్నారు. అయితే తెలుగు లో కాకుండా ఇతర భాషల్లో ఈమె ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అమ్మాయి అనే ఒక ట్యాగ్‌ కారణంగానే టాలీవుడ్‌ స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఆమెను పక్కన పెడుతున్నారేమో అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ప్రియాంక మరింత పాపులారిటీని సొంతం చేసుకుని ఇతర భాషల్లోనూ నటించే ఆఫర్లు సొంతం చేసుకోవాలని ఆమె ఫాలోవర్స్ కోరుకుంటున్నారు.