స్టార్ హీరోయిన్ బటన్ లెస్ ఫోజ్
భర్త నిక్ జోనాస్.. కుమార్తె మాల్తీ మేరీతో లైఫ్ సెలబ్రేషన్ అంటే ఏమిటో చూపిస్తోంది.
By: Tupaki Desk | 6 Nov 2024 3:00 AMఫోటో సెషన్ కోసం ఫోటోలు దిగడం వేరు. ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారం ఫోటోలు, సెల్ఫీలు దిగడం వేరు. ఈ రెండో రకం ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలోకి వచ్చినప్పుడు విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి విమర్శలే ఎదురవుతున్నాయి పీసీ అలియాస్ ప్రియాంక చోప్రాకు. ఈ భామ గ్లోబల్ స్టార్ గా అందరి హృదయాలను గెలుచుకుంది. భర్త నిక్ జోనాస్.. కుమార్తె మాల్తీ మేరీతో లైఫ్ సెలబ్రేషన్ అంటే ఏమిటో చూపిస్తోంది. ఆ ఇద్దరి అన్యోన్య దాంపత్యం అన్నివేళలా ఆకర్షిస్తోంది.
అమెరికన్ అయిన నిక్ జోనాస్ భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆచారాలను పాటిస్తూ పీసీ కొంగు పట్టుకుని తిరుగుతుంటే పీసీని పొగిడేయకుండా ఉండలేకపోతున్నారు. దేశీగాళా మజాకానా! అంటూ పొగిడేస్తున్నారు. ఇక నిక్ జోనాస్ తో బెడ్ రూమ్ లో లేదా రొమాంటిక్ వెకేషన్ లో ఉన్నప్పుడు కొన్ని ప్రయివేట్ ఫోటోలను పీసీ స్వయంగా సోషల్ మీడియాల్లో షేర్ చేసిన సందర్భాలున్నాయి. అయితే అవి అధికారికం. కానీ అప్పుడప్పుడు ప్రియాంక చోప్రా ప్రయివేట్ ఫోటోలు కొన్ని లీకై ఇంటర్నెట్ లో గందరగోళానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టంట్ బాలీవుడ్ షేర్ చేసిన ఓ సెల్ఫీ పలు సందేహాలు కలిగించింది.
ఇది లీక్డ్ ఫోటోనా? లేక పీసీ స్వయంగా సామాజిక మాధ్యమాలలో షేర్ చేసినదా? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఒక్కోసారి సెట్లో అన్ ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు తన వ్యక్తిగత స్టాఫ్ ఫోటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం అవి వైరల్ అయిపోవడం, అటుపై విమర్శలు వగైరా చూసాం. ఇప్పుడు పీసీ ఫోటోగ్రాప్ అలాంటిదేనా? అన్న సందేహాలు ఉన్నాయి. ఈ ఫోటోగ్రాఫ్ లో ప్రియాంక చోప్రా బోల్డ్ గా కనిపిస్తోంది. డెనిమ్ జీన్స్ కి బటన్ తొలగించి మైమరపుగా ఆచేతనంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. జీన్స్ బెల్ట్ తొలగిస్తూ బటన్ లెస్ గా కనిపించింది. అలాగే పీసీ చిట్టి పొట్టి టాప్ కూడా ఈ ఫోటోగ్రాఫ్ లో అంతే హైలైట్ గా కనిపిస్తోంది. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఏదో మాట్లాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
ఫ్యామిలీ సెలబ్రేషన్:
ప్రియాంక చోప్రా జోనాస్ - నిక్ జోనాస్ `పర్ఫెక్ట్ దివాలోవీన్` జరుపుకున్నారు. శుక్రవారం ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పీసీ ఇలా రాశారు. ఈ సంవత్సరం దీపావళి ప్రారంభం.. దక్షిణాసియా మతానికి చెందిన పండుగ. చెడుపై మంచి విజయాన్ని సెలబ్రేట్ చేయడం.. హాలోవీన్ రోజునే కాబట్టి దివాలోవీన్ అని అంటున్నాను అని రాసింది. కాంతి ఎల్లప్పుడూ చీకటిని జయిస్తుంది .. మంచి ఎల్లప్పుడూ చెడుపై విజయం సాధిస్తుంది అని పీసీ వ్యాఖ్యను జోడించింది. పీసీ తదుపరి సిటాడెల్ సీజన్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.