శనివారం బ్యూటీని గ్యాంగ్ తో వెంట పడి వేధించిన యువకుడు!
అతడు నిజంగా అభిమాని అయితే అలాంటి పనులు ఎందుకు చేస్తాడని ప్రియాంక మోహన్ అంది.
By: Tupaki Desk | 30 Sep 2024 3:30 PM GMTహీరోయిన్లకు అప్పుడప్పుడు ఆకతాయిలతో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా హీరోయిన్లు క్రౌడ్ లో కి వెళ్లిన సమయంలో అసౌకర్యానికి గురవువుతంటారు. సెక్యురిటీ సిబ్బంది ఉన్నా? అలాంటి సమయంలో జనాల్ని అదుపు చేయడం అన్నది కష్టమైన పని. ఈ సమయంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో సదరు భామలు ఆగ్రహానికి గురవుతుంటారు. అయితే `సరిపోదా శనివారం` బ్యూటీ ప్రియాంక మోహన్ ని మాత్రం తనని ఒకరు టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నాడని ఆరోపించింది.
తమిళ సినిమా `బ్రదర్` టీజర్ కార్యక్రమంలో అమ్మడు పాల్గోంది. అదే సమయంలో ఓ యువకుడు ప్రియాంకతో సెల్పీ కోసం ప్రయత్నించాడు. దీంతో ప్రియాంక ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చెందింది. ఇంత జనాల్లో సెల్పీ ఇవ్వాలా? అంటూ సీరియస్ అయింది. ఈఘటన అక్కడ పెద్ద పెద్ద కలకలాన్నే రేపింది. సెల్పీ అడిగినందకు ప్రియాంక అంత సీరియస్ అవ్వాలా? సింపుల్ గా నో చెప్పి వెళ్లపోయేదానికి అంత సీన్ క్రియేట్ చేయాలా? అనొచ్చు. అయితే అక్కడ మరో మ్యాటర్ ఉందని తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహరం గురించి మరో నటి శరణ్యతో ప్రియాంక పంచుకున్న వీడియో వైరల్ అవుతుంది. అందులో ప్రియాంక ఇలా అంది. తనని చాలా రోజులుగా ఆ యువకుడు పనిగట్టుకుని వెంబడిస్తున్నాడని అంది. చివరికి తన ఇంటి వరకూ కూడా వచ్చాడని అంది. `బ్రదర్` సినిమా ఈవెంట్ రోజున కూడా ఆ యువకుడు తన గ్యాంగ్ తో స్థానిక వెలచ్చేరి లోని పినిక్స్ మాల్ నుంచి తనని ఫాలో అవుతూ వచ్చాడని ఆరోపించింది.
అతడు నిజంగా అభిమాని అయితే అలాంటి పనులు ఎందుకు చేస్తాడని ప్రియాంక మోహన్ అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రియాంక మాటల్ని బట్టి చూస్తే ఆమెని ఆ యువకుడు టార్గెట్ చేసి ఫాలో అయినట్లే కనిపిస్తుంది. మరి ఈ ఘటనపై ప్రియాంక లీగల్ యాక్షన్ తీసుకుంటుందా? అన్నది తెలియాలి.