Begin typing your search above and press return to search.

న‌టి మొద‌టి సంత‌కం వెన‌క బ‌కెట్ క‌న్నీళ్లు?

త‌న త‌ల్లి బ‌ల‌వంతం మీద న‌టి అయింది.. కానీ భార‌త‌దేశంలోనే నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా ఎదిగింది.

By:  Tupaki Desk   |   30 Nov 2024 11:30 PM GMT
న‌టి మొద‌టి సంత‌కం వెన‌క బ‌కెట్ క‌న్నీళ్లు?
X

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కూ అంచెలంచెలుగా ఎదిగిన‌ ప్రియాంక చోప్రా అజేయ‌మైన కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. 2000లో మిస్ వరల్డ్ పోటీలో కిరీటం గెలుచుకున్న తర్వాత ఈ బ్యూటీ నటనలోకి అడుగుపెట్టింది. అయితే న‌టి అవ్వాల‌ని ప్రియాంక చోప్రా కోరుకుందా? అంటే నిస్సందేహంగా కోరుకోలేదు. అనుకోకుండానే న‌ట‌న‌లోకి వ‌చ్చింది ప్రియాంక చోప్రా. త‌న త‌ల్లి బ‌ల‌వంతం మీద న‌టి అయింది.. కానీ భార‌త‌దేశంలోనే నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా ఎదిగింది. న‌టిగా.. మిగిలిన‌దంతా చ‌రిత్ర‌.

నిజానికి మిస్ వ‌ర‌ల్డ్ గా ఎంపిక‌య్యాక న‌ట‌న‌లోకి రావాల‌ని కోరిన‌ట్టు ప్రియాంక చోప్రా త‌ల్లి మ‌ధు చోప్రా చెప్పారు. కానీ దానికి పీసీ అంగీక‌రించ‌లేదు. సినిమాలకు సంతకం చేయడం ఇష్టం లేదని, బదులుగా క్రిమినల్ సైకాలజిస్ట్ లేదా ఏరోనాటికల్ ఇంజనీర్ కావడానికి చదువుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించింది. పీసీ సంతకం చేసిన మొదటి సినిమా కాంట్రాక్ట్ వెన‌క `చాలా కన్నీళ్లు` ఉన్నాయని మ‌ధు చోప్రా తెలిపారు. పోడ్‌కాస్ట్ సమ్‌థింగ్ బిగ్గర్ షోలో రోడ్రిగో కెనెలాస్‌తో మాట్లాడుతూ ఈ ర‌హ‌స్యాన్ని బ‌హిర్గ‌తం చేసారు. మిస్ వరల్డ్ పోటీలో గెలిచిన తర్వాత ప్రియాంక చోప్రాకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయని మధు చోప్రా వెల్లడించారు. ప్రియాంక చాలా తెలివైన అమ్మాయి అని, ఆమె లక్ష్యం వేరే ఉందని డాక్టర్ మ‌ధు చోప్రా చెప్పారు. ఆమెకు సైన్స్ సబ్జెక్ట్‌లపై ఆస‌క్తి. క్రిమినల్ సైకాలజిస్ట్ లేదా ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకుంది. తన కుమార్తె ఇలాంటి అద్భుత‌మైన‌ ప్రణాళికల‌ను కలిగి ఉందని, అయితే విధి తన దారిని మార్చేసింద‌ని మ‌ధు చోప్రా అన్నారు.

మొద‌టి సినిమాకి సంత‌కం చేసిన‌ప్పుడు ఆల్మోస్ట్ క‌న్నీళ్లు పెట్టుకుంద‌ని కూడా మ‌ధూ తెలిపారు. అయితే తాను స‌ముదాయిస్తూ వేసవిలో కొన్ని నెలల పాటు దీన్ని ప్రయత్నించమని ప్రియాంకతో చెప్పానని, అది నచ్చకపోతే తాను చేయాలనుకున్నదానికి తిరిగి చేయ‌వచ్చని మధు చోప్రా అన్నార‌ట‌. ఎప్పుడైనా చ‌దువుకునేందుకు అవ‌కాశం ఉంది. కానీ అవ‌కాశాన్ని ఉపయోగించుకోవాలని తన కుమార్తెను కోరినట్లు మ‌ధు చోప్రా తెలిపారు.

ప్రియాంక చోప్రా న‌టి అయ్యాక ఎదురే లేకుండా దూసుకెళ్లింది. ప‌రిశ్ర‌మ‌లో ఇంతింతై అన్న చందంగా ఎదిగింది. బాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌గా ఏలింది. ఇటీవ‌ల `సిటాడెల్` వెబ్ సిరీస్‌లోను న‌టించింది. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లి న‌టించింది. ఆ స‌మ‌యంలో ప‌రిచ‌య‌మైన న‌టుడు గాయ‌కుడు నిక్ జోనాస్ ని పెళ్లాడింది. ప్రస్తుతం పీసీ లండన్‌లో ఉంది. గత కొన్ని నెలలుగా తన వెబ్ సిరీస్ సిటాడెల్ రెండవ సీజన్ షూటింగ్‌లో ఉంది.