Begin typing your search above and press return to search.

SSMB 29.. మహేష్ ఫ్యాన్స్ అలా అంటున్నారా?

వీడియోలో సింహాన్ని బోనులో బంధించినట్లు, పాస్‌ పోర్ట్‌ చూపిస్తూ కనిపించారు జక్కన్న.

By:  Tupaki Desk   |   25 Jan 2025 4:15 PM GMT
SSMB 29.. మహేష్ ఫ్యాన్స్ అలా అంటున్నారా?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ (SSMB 29) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే సినీ ప్రియులు.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చేసింది. ఫారిన్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు రాజమౌళి.. ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వీడియోలో సింహాన్ని బోనులో బంధించినట్లు, పాస్‌ పోర్ట్‌ చూపిస్తూ కనిపించారు జక్కన్న.

అయితే రాజమౌళి పెట్టిన వీడియో పోస్ట్ కు.. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను అని మహేష్ బాబు కామెంట్ పెట్టారు. ఆ సమయంలో హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా రెస్పాండ్ అయ్యారు. ఫైనల్లీ అంటూ తన హ్యాపీ నెస్ ను షేర్ చేసుకున్నారు. దీంతో కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు.. ఊహాగానాలు నిజమయ్యాయి. మహేష్ తర్వాత అధికారికంగా ప్రకటించిన నటిగా ప్రియంక నిలిచారు.

అదే సమయంలో ప్రియాంక హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమె భారత్ రాగా.. రాజమౌళి లుక్ టెస్ట్ చేసినట్లు సమాచారం. ఏదేమైనా జక్కన్న.. ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక పెద్ద ప్లానే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అన్నీ ఆలోచించే హీరోయిన్ విషయంలో డెసిషన్ తీసుకుని ఉంటారని చెప్పవచ్చు.

అయితే ప్రియాంకను సినిమాలోకి తీసుకోవడం కొందరు మహేష్ ఫ్యాన్స్ కు నచ్చలేదని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మహేష్ పక్కన ప్రియాంక సెట్ కారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాస్త ముదురుగా కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి మహేష్ వయసు కన్నా ప్రియాంక ఏజ్ తక్కువే. మహేష్ వయసు 49 కాగా.. ప్రియాంక 42.

కానీ పెయిర్ అనుకున్న స్థాయిలో చూడ ముచ్చటగా ఉండదని కామెంట్స్ పెడుతున్నారు. వేరే హీరోయిన్ ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అలా ఒక్కొక్కరు ఒక్కోలా డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రియాంక సినిమాలో కీలక పాత్ర పోషిస్తారని, రెగ్యులర్ హీరోయిన్ కాదని కొందరు అంటున్నారు.

హీరోయిన్ గా మరొక ముద్దుగుమ్మ నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఇండోనేషియాకు చెందిన ఒక బ్యూటీని ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. ఆమె మెయిన్ హీరోయిన్ అని.. ప్రియాంక కీలక పాత్రలో నటిస్తారని వినికిడి. మొత్తానికి ప్రియాంక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు SSMB 29లో మెయిన్ హీరోయిన్ ఎవరో.. ఏంటో మేకర్స్ రెస్పాండ్ అయితే గానీ తెలియదు.