Begin typing your search above and press return to search.

చికెన్ తీస్తే కిచెన్ నాదే అంటోంది!

ఏడాదిలో డైట్ కి అంటూ కొన్ని రోజులు కేటాయించుకుని మిగ‌తా రోజులు మాత్రం ముద్ద లేనిదే ముక్క దిగ‌దంటోంది

By:  Tupaki Desk   |   9 Jun 2024 1:30 AM GMT
చికెన్ తీస్తే కిచెన్ నాదే అంటోంది!
X

హీరోయిన్లు అంతా పుడ్ విష‌యంలో ఎంత ఓపెన్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ నాన్ వెజ్ హీరోయిన్లు అయితే హైద‌రాబాద్ బిర్యానీ గురించి ఎంతో ప్ర‌త్యేకంగా చెబుతారు. భాగ్య‌న‌గ‌రంలోని అన్ని ర‌కాల నాన్ వెజ్ రుచుల్ని ఆస్వాదించిన భామ‌లెంతో మంది. తాజాగా ఆ జాబితాలో ప్రియాంక మోహ‌న్ కూడా చేరిపోయింది. హైద‌రాబాద్ లో ఉంటే వారంలో రెండు రోజులు ఇక్క‌డ రుచులే ఆస్వాదిస్తుందిట‌. నాన్ వెజ్ లో ఏ వంట‌కం వ‌దిలిపెట్ట‌కుండా ఆస్వాదిస్తుందిట‌.

ఏడాదిలో డైట్ కి అంటూ కొన్ని రోజులు కేటాయించుకుని మిగ‌తా రోజులు మాత్రం ముద్ద లేనిదే ముక్క దిగ‌దంటోంది. అంతే కాదు ఇంట్లో నాన్ వెజ్ వంట‌కాలు చేయ‌డంలో తానో స్పెష‌లిస్ట్ అట‌. ఇంటికి చికెన్ తీసుకొస్తేమాత్రం కిచెన్ నాదే అంటోంది. ఆరోజు మాత్రం నాన్ వెజ్ వంట‌కాల‌న్ని స్వ‌యంగా త‌యారు చేసి త‌ల్లిదండ్రుల‌కు పెడుతుందిట‌. ఇలా పేరెంట్స్ కి వండి పెట్ట‌డంతో ఎంతో తృప్తి క‌లుగుతుంద‌ని తెలిపింది.

ఈ విష‌యంలో ప్రియాంక ని గ్రేట్ అని మెచ్చుకోవాల్సిందే. పెళ్లికాని హీరోయిన్లు అమ్మ‌తో ఉన్నంత కాలం వంట‌గ‌దిలోకి వెళ్ల‌మ‌ని చెప్పిన వాళ్ల‌ను ఎంతో మందిని చూసాం. ఇంటి బాధ్య‌త‌ల విష‌యంలో అంటి అంట‌న‌ట్లే ఉంటామ‌ని చాలా మంది భామ‌లు స‌ర‌దాగా చెప్పిన సంద‌ర్భాలెన్నో . కానీ ప్రియాంక మాత్రం అలాంటి వాళ్ల‌కు భిన్నంగా క‌నిపిస్తుంది. బ‌ద్ద‌కం భామ‌లంతా ప్రియాంకను చూసి నేర్చుకోవాల్సిన విష‌యాలు చాలానే ఉన్నాయి.

ఇక టాలీవుడ్ లో ప్రియాంక మోహ‌న్ జ‌ర్నీ గురించి తెలిసిందే. నాని` గ్యాంగ్ లీడ‌ర్` సినిమాతో అమ్మ‌డు తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అటుపై `శ్రీకరం` అనే సినిమాలో న‌టించింది. ఈ రెండు సినిమాలు కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో ప్రియాంక కొన్నాళ్లు త‌మిళ్ సినిమాలే చేసింది. ప్ర‌స్తుతం నానితోనే మ‌ళ్లీ `సరిపోదా శ‌నివారం` అనే సినిమా చేస్తోంది. త‌మిళ్ లో బ్ర‌ద‌ర్ అనే సినిమా చేస్తోంది.