Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లి కోసం నిక్‌తో వస్తూ పీసీ ఏం చేసిందో?

హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు ఈరోజు 12 జులై 2024న జ‌రుగుతున్న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో సంద‌డిగా క‌నిపించారు.

By:  Tupaki Desk   |   13 July 2024 12:30 AM GMT
అంబానీ పెళ్లి కోసం నిక్‌తో వస్తూ పీసీ ఏం చేసిందో?
X

అనంత్ అంబానీ- రాధికా మ‌ర్చంట్ పెళ్లికి అంత‌ర్జాతీయ దిగ్గ‌జాల‌తో పాటు బాలీవుడ్ ప్ర‌ముఖులంతా ఎటెండ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం సాయంత్రం నాటికే వ‌ర‌ల్డ్ బెస్ట్ స్టార్స్ అంతా అంబానీ ఈవెంట్ కోసం దిగిపోయారు. ఇందులో క‌ర్ధాషియ‌న్ సిస్ట‌ర్స్, టైసన్ పేర్లు కూడా ఉండ‌టం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్ర‌పంచ కుభేరుడి ఆహ్వానం అందుకున్న ప‌లువురు అంత‌ర్జాతీయ స్టార్లు ఈవెంట్ కి విచ్చేశారు. పెళ్లి వేడుక‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేవారు కొంద‌రైతే ఈ వేడుక‌ల‌ను భార‌తీయ సాంప్ర‌దాయాన్ని త‌నివి తీరా ఆస్వాధించాలని భావించేవారు మ‌రికొంద‌రు... మొత్తంగా అంబానీల పెళ్లి వేడుక ఝాంఝాం అంటూ సాగుతోంది.

హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు ఈరోజు 12 జులై 2024న జ‌రుగుతున్న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో సంద‌డిగా క‌నిపించారు. ఇప్ప‌టికే స‌ల్మాన్, అమితాబ్, ర‌ణ‌వీర్ స‌హా ప‌లువురు పెళ్లి వేడుక‌ల‌కు విచ్చేసిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ముంబై వేదిక‌గా హిందూ సాంప్ర‌దాయంలో పెళ్లాడుతున్నారు. పలువురు ప్రముఖులు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్ర‌త్యేక‌మైన వ‌స్త్ర‌ధార‌ణ‌తో క‌నిపించారు. అతిథులు వేదిక వద్దకు వ‌స్తుండ‌గా.. చాలా ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఇక అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ కూడా తమ కారులో రొమాంటిక్ గా జోష్ ఫుల్ గా వేడుకలకు బ‌య‌ల్దేరి వ‌చ్చారు.

సాంప్ర‌దాయ దుస్తుల్లోను పీసీ-నిక్

నిక్ జోనాస్ తాజాగా ఇన్‌స్టాలో తన భార్య ప్రియాంక చోప్రాతో కలిసి తమ కారులో తీసిన సరదా వీడియోను షేర్ చేసాడు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ వేడుకకు సంబంధించిన దుస్తుల కోడ్ అయిన భారతీయ సాంప్రదాయ దుస్తులను ధరించి సుందరమైన జంట కనిపించారు. నిక్ బేబీ పింక్ షేర్వానీ ధరించి ఉండగా, PC పసుపు రంగు లెహంగాలో అద్భుతంగా కనిపించింది. వీడియో క్లిప్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో బార్బీ గర్ల్ పాట ప్లే అవుతోంది. ప్రియాంక సరదాగా పెదవులు క‌దుపుతూ ``రండి బార్బీ, పార్టీకి వెళ్దాం`` అంటూ వ్యాఖ్యానించారు. పీసీ ముసిముసి నవ్వులు హాయిని గొలిపాయి. తన భర్తతో అరుదైన మూవ్ మెంట్ ని పీసీ షేర్ చేస్కుంది. ఈ ఇద్దరు క‌చ్ఛితంగా మా బార్బీ మరియు కెన్.

ఈ జంట చేష్టలను చూసి అభిమానులు గ‌గ్గోలు పెట్టారు. ఒక నెటిజ‌న్ ఇలా రాసాడు. ``ఆమె నిజంగా మా బార్బీ`` అని వ్యాఖ్యానించ‌గా.. బార్బీ - కెన్ సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు! అని మ‌రొక‌రు రాసారు. ఈ జంట చాలా అందంగా ఉంది అంటూ ఒక‌రు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానించారు. ప్రియాంక చోప్రా ఇన్‌స్టాలో ఒక ప్ర‌త్యేక ఫోటోని షేర్ చేసింది. పూల ఎంబ్రాయిడరీ .. నిక్ జోనాస్ పింక్ షేర్వానీతో తన పసుపు లెహంగా డీటెయిలింగ్ ను ప్రదర్శించే ఫోటోని షేర్ చేసింది.

నిజానికి ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ నిన్న ముంబైలో సంద‌డి చేశారు. షారుఖ్ ఖాన్ తన న్యూయార్క్ సెలవుదినం నుండి గత రాత్రి తిరిగి వచ్చారు. అయితే సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ వింబుల్డన్ 2024 తర్వాత ఈ ఉదయం పెళ్లి వేడుక కోసం తిరిగి వచ్చారు.