జోనాస్ ఫ్యామిలీ కలతలు.. కోడళ్లు ఎడమొహం పెడమొహం!
అయితే ప్రియాంక చోప్రా- సోఫీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? ఇద్దరి మధ్యా స్నేహం ఇప్పుడు లేనే లేదా?
By: Tupaki Desk | 15 Oct 2023 4:30 PM GMTఅమెరికా కోడలు అయిన ప్రయాంక చోప్రా కుటుంబంలో ఇటీవలి పరిణామాలు మీడియాలో ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. తన బావ గారైన జో జోనాస్- సోఫీ టర్నర్ మధ్య విభేధాలు, విడాకుల వ్యవహారం ఇటీవల మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అమెరికన్ పాప్ సింగర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ సోఫీ- జో జోనాస్ అధికారికంగా తమ బ్రేకప్ గురించి ప్రకటించారు. జోనాస్ కుటుంబంలోని మిగిలిన వారితో టర్నర్‌కు ఉన్న సంబంధాలపై ఎలాంటి కథనాలు రాకపోయినా కానీ, ఈ విడాకుల వెనక ప్రియాంక చోప్రా జోనాస్ ప్రమేయం పరోక్షంగా ఉందని కూడా కథనాలొచ్చాయి.
కుటుంబ సభ్యులు ప్రియాంక చోప్రాతో పోల్చి చూడటం సోఫీని ఇబ్బందికి గురి చేసిందని కూడా చర్చ సాగుతోంది. సోఫీ టర్నర్ పార్టీ కల్చర్ ఇంట్లో అన్నివేళలా నచ్చేది కాదు. అయితే భారతీయ అమ్మాయి ప్రియాంక చోప్రా సాంప్రదాయం, చొరవ, కుటుంబంతో మింగిల్ అయ్యే స్వభావం వీటన్నిటిని ప్రస్థావిస్తూ జోనాస్ కుటుంబం సోఫీని దెప్పి పొడిచేదని దాంతో మనస్థాపం చెందిన సోఫీ ఇప్పుడిలా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ఒక కోణం అని కూడా గుసగుసలు వినిపించాయి.
అయితే ప్రియాంక చోప్రా- సోఫీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా? ఇద్దరి మధ్యా స్నేహం ఇప్పుడు లేనే లేదా? అంటే.. ఇంతలోనే ఈ గాసిప్స్ ని నిజం చేస్తున్నట్టుగానే వ్యవహారం కనిపిస్తోంది. జోనాస్ కోడలు ప్రియాంక చోప్రా జోనాస్‌ను సోఫీ టర్నర్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం చాలా మంది ఆశ్చర్యానికి గురిచేసింది. తోబుట్టువులు అయిన జోనాస్ సోదరుల అందమైన బంధంతో పాటు.. తన సోదరీమణులిద్దరి(సోఫీ కూడా)తో తనకు ఉన్న సంబంధం గురించి పీసీ తరచుగా మాట్లాడుతుంది. నిజానికి సోఫీ టర్నర్ - ప్రియాంక ఇద్దరు నటీమణులు ఇంటర్వ్యూల్లో అనేక సందర్భాల్లో తమ మధ్య గొప్ప అనుబంధం ఉందని తెలిపారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోయినట్టే కనిపిస్తోంది. జో-సోఫీ జంట విడాకుల వార్తలు వేడెక్కిస్తున్న క్రమంలో ఈ విషయంపై ప్రియాంక చోప్రా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది. ఈ బ్రేకప్ వ్యవహారంపై పీసీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. లైఫ్ & స్టైల్ కథనంలో ప్రియాంక - సోఫీ చాలా సన్నిహితంగా ఉండేవారని పేర్కొన్నారు. ఒకప్పుడు సోఫీ - జో లండన్‌కు వెళితే, నిక్ -ప్రియాంక కూడా వారితో కలిసి వెళ్లేవారని ప్రచారం ఉంది. ప్రియాంక సోఫీని ఆమె మేనకోడళ్లను ప్రేమిస్తుంది. జీవితంలో బంధువులకు అపాయం కలిగించేలా ఏమీ చేయాలనుకోదు`` అని సదరు కథనంలో ఉటంకించారు.
గతంలో సోఫీ టర్నర్ భారతదేశంలో ప్రియాంక చోప్రా జోనాస్ స్టార్‌డమ్‌ను ..నిక్ జోనాస్‌తో ఆమె వివాహ సమయంలో వారు ఎలా రాజరికపు గౌరవాన్ని పొందారు అనే విషయాలను ప్రస్థావిస్తూ ప్రశంసించారు. ప్రియాంక చోప్రా జోనాస్ తన సోదరీమణుల(సోఫీని కూడా)ను జో సోదరీమణులు అని పిలుస్తారు. వారంతా తమ పిల్లలతో కలిసి వచ్చినప్పుడు ఆ సన్నివేశం ఎలా భారీ పార్టీ అవుతుంది? అనే దాని గురించి ప్రియాంక చోప్రా ఎంతో సంబరంగా చెప్పింది.