అక్క అమెరికాకోడలైనా..తమ్ముడు ఇడియా అల్లుడే!
అవును నటి ప్రియాంకచోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పలు తెలుగు తమిళ సినిమాల్లో నటించిన నీలం ఉపాధ్యాయతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
By: Tupaki Desk | 3 April 2024 7:26 AM GMTబాలీవుడ్ నటి ప్రియాకం చోప్రా - అమెరికాకు చెందిన నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా కోడలైన సంగతి తెలిసిందే. భారతీయ నటిగా బాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ఉన్నా అమ్మడు పెళ్లైన తర్వాత కాపురం మాత్రం అమెరికాలోనే పెట్టింది. హాలీవుడ్ లో నిలదొక్కుకునే క్రమంలో భాగంగా అమ్మడు అలా ప్లాన్ చేసి ముందుకెళ్లింది. దీంతో అప్పటి నుంచి అమెరికా కోడలంటే అందరికీ గుర్తొచ్చేది పీసీనే. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్దార్ధ్ చోప్రాని కూడా అమెరికా తెల్ల పిల్లని చూసి తమ్ముడకి పెళ్లి చేస్తుందా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి.
తమ్ముడికి మంచి లైఫ్ ఇవ్వడం కోసం పీసీ ఇలా ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదని బాలీవుడ్ మీడియాలో గతంలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ పీసీ సొదరుడు మాత్ర అక్కాలా ఆలోచించలేడు. అక్క అమెరికా కోడలైనా... .తమ్ముడు మాత్రం ఇండియా అల్లుడే అని నిరూపించాడు. అవును నటి ప్రియాంకచోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పలు తెలుగు తమిళ సినిమాల్లో నటించిన నీలం ఉపాధ్యాయతో నిశ్చితార్థం చేసుకున్నాడు.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో ఫోటోలు కూడా షేర్ చేసారు. సిద్ధార్థ్ ఫ్లోరల్ బంద్‌గల సూట్ ధరిచంగా... నీలం సంప్రదాయ పర్పుల్ ఎంబ్రయిడరీ సూట్ ధరించింది. జోడీ ఎంతో అందంగా కనిపిస్తుంది. నిశ్చితార్థ కేకుపై 'జస్ట్ రోకాఫీడ్' అని రాసివుంది. ప్రియాంక చోప్రా కూడా ఇన్ స్టాలో ఆ ఫోటోల్ని షేర్ చేసింది. ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఓ ఫోటోలో ప్రియాంకా చోప్రా-నిక్ జోనాస్ కూడా పాల్గొన్నారు. నిశ్చితార్దం కోసం పీసీ భర్తతో కలిసి మరోసారి ఇండియాకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక నీలం ఉపాధ్యయ టాలీవుడ్ కి సుపరిచితమే. మిస్టర్ -7..యాక్షన్3డీ..పండగలా వచ్చాడు..తమాషా లాంటి చిత్రాల్లో నటించింది. తమిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. కానీ నటిగా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. సిద్ధార్థ్‌కు ఇది రెండవ ఎంగేజ్ మెంట్. ఇంతకుముందు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 2019లో వీరి వివాహం జరగాల్సి ఉండగా అనూహ్యంగా రద్దు చేసుకున్నారు.