ప్లాప్ సిరీస్ కి కంటున్యూటీ..మళ్లీ పీసీ కేఛాన్స్!
స్పై పాత్రలో ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ వెబ్ సిరీస్ `సీటాడెల్` సీజన్ వన్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 7 Aug 2024 7:44 AM GMTస్పై పాత్రలో ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ వెబ్ సిరీస్ `సీటాడెల్` సీజన్ వన్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. జోష్ అపెల్బబ్, బ్రెయాన్ ఓహ్, డేవీడ్ వీల్ తెరకెక్కించారు. కానీ నిర్మాతలు రూసో బ్రదర్స్ కి వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఈ సిరీస్ మిగిల్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సీరిస్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. కానీ ప్రేక్షకులకు ఏమాత్రం సీజన్ వన్ రుచించలేదు.
ప్రియాంక చోప్రా నటన వరకూ ఎలాంటి విమర్శలు లేవు గానీ, అంతిమంగా స్టోరీ లోనే వైఫల్యం హైలైట్ అయింది. రివ్యూలు ఏమాత్రం పాజిటివ్ గా రాలేదు. దీంతో ఇండియన్ వెర్షన్ `సీటాడెల్` పరిస్థితి ఏంటి? అన్న ఆందోళన సైతం అభిమానుల్లో ఉంది. ఇండియన్ వెర్షన్ లో పీసీ పోషించిన పాత్రని సమంత పోషించిన సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దీన్ని రూపొందించారు. సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఆ సంగతి పక్కనబెడితే..
హాలీవుడ్ లో ఈ సిరీస్ కి సీజన్ -2ని కూడా తెరకెక్కిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం మేకర్స్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు నిర్మాణ వర్గాలు తెలిపాయి. సీజన్ వన్ లో దొర్లిన తప్పిదాలు పునరావృతం కాకుండా సరికొత్త ఫీల్ అందించేలా సీజన్ -2 ఉటుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఈ సీజన్ కోసం మరికొంత మంది ఫేమస్ నటీనుటలతోపాటు కొత్తవారిని తెరపైకి తెస్తున్నారు.
`వాట్ వీ డూ ఇన్ ద షాడోస్` , `ఫెరారీ` చిత్రాల్లో నటించిన మ్యాట్ బెరీ, గాబ్రిన్ లియోన్ లు రంగంలోకి దించుతున్నారు. వాళ్లతో పాటు హాలీవుడ్ లో నటించిన కొత్త తరం నటుల్ని ఎంపిక చేస్తున్నట్లు నిర్మాణ వర్గాలు తెలిపాయి. మరి సీజన్ -2 లో ప్రియాంక చోప్రా రోల్ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఇందులో రిచర్డ్ మాడెన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్రకి ధీటుగానే పీసీ రోల్ ని సిరీస్ లో డిజైన్ చేసారు.