పైకెగదోస్తూ పీసీ చాలా ఇబ్బంది పడిందే!
ఓవైపు సెల్పీలు ఇవ్వాలా?... లేక అసౌకర్యమైన దుస్తుల్ని సర్దుకోవాలో? అర్దం కాక రష్మిక ఎంతో ఇబ్బంది పడింది
By: Tupaki Desk | 21 Dec 2023 7:30 AM GMTడిజైనర్ దుస్తుల పేరిట హీరోయిన్లు అప్పుడప్పడుడు చాలా అసౌకర్యానికి గురవుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఔట్ పిట్స్ మరీ అంత సౌకర్యంగా అనిపించవు. అలాంటి వాటితో పబ్లిక్ లోకి వస్తే! ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలిసిందే. ఆ మధ్య రష్మిక మందన్న ఎరుపు వర్ణం స్కర్టు దుస్తుల్లో మీడియా ముందుకొచ్చింది. ఆ సమయంలో సెల్పీల కోసం కుర్రాళ్లంతా మీద మీద పడ్డారు.
ఓవైపు సెల్పీలు ఇవ్వాలా?... లేక అసౌకర్యమైన దుస్తుల్ని సర్దుకోవాలో? అర్దం కాక రష్మిక ఎంతో ఇబ్బంది పడింది. ఇంకా హన్సీక సహా చాలా మందిభామలు అసౌకర్యమైన దుస్తుల్లో ఇబ్బంది పడ్డవారే. తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా అలాంటి అసౌకర్యానికే గురైనట్లు తెలుస్తోంది. ఇదిగో ఇక్కడిలా ఏదో ఈవెంట్ కి భర్త నికో జోనాస్ తో కలిసి జంటగా హాజరైంది. వేదిక మీద అప్పటికే నిక్ కెమెరాకి ఫోజులివ్వడానికి సిద్దంగా ఉన్నాడు.
అదే సమయంలో పీసీ వేదిక మీదకు నడుచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె ధరించిన దుస్తులు కిందకి జారిపోతున్నాయి. దీంతో జారిపోతున్న ఆ దుస్తుల్ని పైకి ఎగదొసుకుంటూ రావాల్సి వచ్చింది. అలా ఒకసారి కాదు. పీసీ అలా పైకి లాగుతుంటే..అవి అంతకంతకు కిందకు జారిపోతున్నాయి. మరోవైపు కాళ్లకు సైతం అసౌకర్యంగానే అనిపిస్తుంది. అయినా తప్పదు. ఎలాగో లా మ్యానేజ్ చేయాలి కాబట్టి ఎలాగూ అక్కడ ఫోటో సోషన్ ముగించింది.
ప్రస్తుతం ఆ ఈవెంట్ కి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అందులో పీసీ పైకి ఎగదోయడమే హైలైట్ అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ `యానిమల్` సాంగ్ ఒకటి ప్లే చేస్తూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. అదీ సంగతి. అసౌకర్యమైన దుస్తులు ధరిస్తే అంతలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీడియా సమావేశాల్లో మాత్రం సౌంకర్యవంతమైన దుస్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెబుతుంటారు. చెప్పే మాటలకు..చేష్టలకు ఏమాత్రం సంబంధం ఉండదు కదూ.