Begin typing your search above and press return to search.

న‌క్లెస్ కంటే అందంగా ప్రియాంక‌ నెక్!

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫ్యాష‌న్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డిజైన‌ర్ డ్రెస్సుల్లో త‌న‌ద‌మైన మార్క్ అప్పిరియ‌న్స్ తో త‌ప్ప‌నిస‌రి.

By:  Tupaki Desk   |   21 May 2024 3:30 PM GMT
న‌క్లెస్ కంటే అందంగా ప్రియాంక‌ నెక్!
X

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫ్యాష‌న్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. డిజైన‌ర్ డ్రెస్సుల్లో త‌న‌ద‌మైన మార్క్ అప్పిరియ‌న్స్ తో త‌ప్ప‌నిస‌రి. ఫోటో షూట్లు..క‌వ‌ర్ పేజీల కోసం అమ్మ‌డి ఎంపిక‌లు సంథింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతుంటాయి. ఇక ప్ర‌త్యేక ఈవెంట్ల కోసం ఇంకెంత అందంగా ముస్తాబవుతుందో చెప్పాల్పిన ప‌నిలేదు. అందులోనూ కేన్స్ లాంటి ఉత్సావాల్లో పాల్గొంటే ప్రియాకం బ్రాండ్ ని మామూలుగా వేయ‌దు.


తాజాగా జ‌రుగుతోన్న కేన్స్ ఉత్స‌వాల కోసం ముస్తాబైన ఓ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో అమ్మ‌డు స్కిన్ టైట్ షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ గౌనులో త‌ళుక్కున మెరిసింది. డార్క్ బ్లూ అండ్ వైట్ కాంబినేష‌న్ లో పీసీ బ్యూటీని ఆ డిజైన‌ర్ మ‌రింత రెట్టింపు చేసింది. ప్ర‌త్యేకంగా నెక్ ని హైలైట్ చేస్తూ ఇన్ స్టాలో ఓ రీల్ వైర‌ల్ అవుతుంది. అంద‌మైన మృదువైన నెక్ పై ఆ బ్యూటీని రెట్టింపు చేస్తూ ధ‌రించిన నెక్ల‌స్ ఎంతో అందంగా ఉంది.


ఆ బ్యూటీని మించి పీసీ నెక్ మ‌రింత అందంగా ఫోక‌స్ అవుతుంది. పీసీ స్కిన్ టోన్ పై నెక్లెస్ మిరుమిట్లు గొలు పుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. పీసీ నెక్ బ్యూటీపై కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. కేన్స్ ఉత్సావాలు ముగిసేలోపు పీసీ నుంచి ఇలాంటి ట్రీట్ ఇంకా కంటున్యూ అవుతూనే ఉంటుంది. ఇప్ప‌టికే భార‌తీయ న‌టీమ‌ణుల రెడ్ కార్పెట్ వాక్ తో కేన్స్ వెడెక్కింది. వీదేశీ భామ‌ల్ని సైతం ఇండియ‌న్ మోడ‌ల్స్ ప‌క్క‌కు నెట్టేస్తున్నారు.

ప్ర‌స్తుతం ప్రియాకం చోప్రా హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ని అక్క‌డే ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది. అలాగ‌ని బాలీవుడ్ ని లైట్ తీసుకోలేదు. అవ‌కాశాలు వ‌స్తే ఇక్క‌డ న‌టించ‌డానికి సిద్దంగానే ఉంది.