Begin typing your search above and press return to search.

ఐశ్వ‌ర్యారాయ్, సుస్మిత‌ల క్లిప్పింగ్స్ దాచుకున్న పీసీ

మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్, మిస్ యూనివ‌ర్శ్ సుస్మితా సేన్ ల‌ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లను భద్రపరిచినట్లు ప్రియాంక చోప్రా వెల్లడించారు

By:  Tupaki Desk   |   29 April 2024 3:51 AM GMT
ఐశ్వ‌ర్యారాయ్, సుస్మిత‌ల క్లిప్పింగ్స్ దాచుకున్న పీసీ
X

మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్, మిస్ యూనివ‌ర్శ్ సుస్మితా సేన్ ల‌ వార్తాపత్రిక క్లిప్పింగ్‌లను భద్రపరిచినట్లు ప్రియాంక చోప్రా వెల్లడించారు. ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ 2000 విజేత‌. మిస్ వరల్డ్ 1994 విజేత ఐశ్వర్య రాయ్, మిస్ యూనివర్స్ 1994 విజేత సుస్మితా సేన్ ల‌ను ప్రియాంక చోప్రా ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రశంసించారు.

కావానాగ్ జేమ్స్ రీడ్ ది రూమ్ పాడ్‌కాస్ట్ ఇటీవలి ఎపిసోడ్‌లో ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ - సుస్మితా సేన్ గురించి చాలా సంగ‌తులు మాట్లాడారు. వారు చిన్న వయస్సులో ప్రపంచవ్యాప్త వేదికపై చాలా అద్భుతంగా రాణించారని పీసీ పేర్కొన్నారు. ఐశ్వర్య రాయ్ 1994లో ప్రపంచసుందరి టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. రీటా ఫరియా పావెల్ (1966) తర్వాత ఈ కిరీటాన్ని ధరించిన రెండవ భారతీయురాలు ఆమె. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలు సుస్మిత. 1994లో మిస్ యూనివ‌ర్శ్ పోటీని గెలుచుకుంది.

అందాల రాణిగా పరివర్తన గురించి అడిగినప్పుడు ప్రియాంక ఇలా చెప్పింది. ``నా దేశంలో అందాల పోటీలు నిజంగా గౌరవించ‌బ‌డ‌తాయి. మిస్ ఇండియా.. మిస్ వరల్డ్ పోటీల కోసం ఆస‌క్తిగా వేచి చూస్తారు. నా దేశం నుండి ఒక దశాబ్దం పాటు విజేతలు ఉన్నారు.. నేను అమెరికాలో కొద్దిగా భిన్నంగా భావించాను.. అందాల‌ పోటీలకు గొప్ప‌ ర్యాప్ (ఖ్యాతి) ఉంది ..ఎదిగే క్ర‌మంలో ఆసక్తిని కలిగి ఉన్నాను.. భారతదేశం త‌ర‌పున పోటీలో పాల్గొన్నాను.. మా కుటుంబం పోటీని చూసింది. ఇది చాలా సరదాగా ఉంది.. అని జ్ఞాప‌కాల‌ను రివైండ్ చేసారు.

1993 లేదా 1994 మిస్ వరల్డ్ - మిస్ యూనివర్స్ లుగా కిరీటాలు గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ - సుస్మితా సేన్ ఇద్దరూ ఆ సంవత్సరం భారతదేశానికి చెందినవారనే విష‌యం నాకు గుర్తుంది. నా గదిలో (ఐశ్వర్య మరియు సుస్మిత) చిన్న కోల్లెజ్ వంటి వార్తాపత్రికల నుండి చిన్న చిన్న స్నిప్పెట్‌లు క‌ట్ చేసి ఉంచాను.. అప్ప‌టికి నేను వారిలా అవ్వాల‌ని అనుకోలేదు. భార‌త‌దేశపు యువతులు గ్లోబల్ స్కేల్‌లో బాగా పని చేస్తున్నారు అని నేను ఎప్పుడూ ఆసక్తిగా ఉన్నాను.., నేను పోటీల్లోకి అనూహ్యంగా విసిరివేయబడినప్పుడు, నేను ఏదో ఒక విధంగా విధికి బిడ్డనని నిజంగా నమ్మాను. నేను దానిని నిజంగా ముందుకు న‌డిపించాను. నేను దానితో పోరాడాను అని అన్నారు. అప్పటికి 18 ఏళ్ల వయసున్న ప్రియాంక మిస్ వరల్డ్ 2000 అందాల పోటీలో విజేతగా నిలిచింది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తనకు తెలియకుండానే త‌న‌ చిత్రాలను పంపినందున `మిస్ ఇండియా` పోటీకి హాజరయ్యారు.

ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్న తర్వాత, ప్రియాంక తన నటనా వృత్తిని తమిళ చిత్రం తమిజన్ (2002)తో ప్రారంభించింది. ఆ తర్వాత పీసీ మొదటి బాలీవుడ్ చిత్రం ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై (2003). తెలుగులో జంజీర్ లాంటి చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న పీసీ న‌టించింది.