బావ జో విడాకులపై పీసీ ఊహించని స్పందన
బహుముఖ ప్రజ్ఞాశాలి, గ్లోబల్ ఐకాన్ అయిన ప్రియాంక చోప్రా జోనాస్, ప్రముఖ అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికా కోడలు అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Sep 2023 7:22 AM GMTబహుముఖ ప్రజ్ఞాశాలి, గ్లోబల్ ఐకాన్ అయిన ప్రియాంక చోప్రా జోనాస్, ప్రముఖ అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి అమెరికా కోడలు అయిన సంగతి తెలిసిందే. ప్రియానిక్ జంట అన్యోన్య దాంపత్యం ఎప్పటికీ అభిమానుల్లో స్ఫూర్తి నింపుతోంది. కానీ ప్రియాంక చోప్రా పేరు ఇటీవల రకరకాల కారణాలతో దేశీ మీడియాలో చర్చగా మారింది.
ప్రియాంక చోప్రా బావగారు జో జోనాస్ తన భార్య సోఫీ టర్నర్ కి విడాకులిస్తుండడమే దీనికి కారణం. ఇటీవల మేరీ క్లైర్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ లో జో జోనాస్-సోఫీ టర్నర్ సహా తన భర్త నిక్ జోనాస్ ఇతర కుటుంబంతో తనకున్న సన్నిహిత సంబంధలపై ప్రియాంక చోప్రా మాట్లాడింది. ప్రియాంక చోప్రా జోనాస్ తరచుగా జె-సిస్టర్స్‌లో ఒకరిగా పిలుపందుకుంది. ఆమె బావ జో జోనాస్ అతని భార్య సోఫీ టర్నర్‌తో గొప్ప అనుబంధం కలిగి ఉంది.
తాజా ఇంటర్వ్యూలో ప్రియాంక బయటి ప్రపంచానికి తెలియని చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ``అంతా అనుకున్నట్టుగా తరచుగా మేము (జో జోనాస్- సోఫీ టర్నర్ ఇతర కుటుంబీకులు) కలుసుకోలేము. కానీ మేము కలిసి ఉన్నప్పుడల్లా అది ఒక భారీ** పార్టీ అవుతుంది. ఈ పార్టీలో తల్లిదండ్రులు, అమ్మాయిలు - అబ్బాయిల రెండు సెట్లుగా విభజించబడి ఉంటారు. సన్నిహితంగా కలిసి మెలిసి ఉండే విందు వినోదాలు మరపురాని క్షణాలను సృష్టిస్తాయి.. అని తెలిపింది.
ప్రియాంక -నిక్ వ్యక్తిగత షెడ్యూల్‌లు చాలా బిజీగా ఉన్నప్పటికీ సవాలుతో కూడిన ప్రయాణంలో ఆస్వాధనల కోసం షెడ్యూళ్ల ప్లానింగులో ఎప్పుడూ బిజీగా ఉంటామని తెలిపారు. మా ఇద్దరి షెడ్యూల్‌లు వ్యక్తిగతంగా చాలా క్రేజీగా ఉన్నాయి. ఎవరికి వారు బిజీ బిజీ. మేము సంవత్సరంలో ఆరు నెలల పాటు కలిసి ఉండే పరిస్థితి లేనే లేదని ప్రియాంక చోప్రా వెల్లడించారు. సెలబ్రిటీ లైఫ్ అంత సులువు కాదని బిజీ షెడ్యూళ్లతో కుటుంబానికి చేరువగా ఉండడం చాలా అరుదు అని స్పష్ఠంగా చెప్పింది. బహుశా పీసీ బావ గార జో జోనాస్ కెరీర్ పరమైన ఒత్తిళ్లతోనే భార్యకు దూరమయ్యాడని కూడా పీసీ తన ఇంటర్వ్యూ లో హింట్ ఇచ్చింది. సోఫీ టర్నర్ తన భర్త జోజోనాస్ ని అర్థం చేసుకోకపోయి ఉండొచ్చనేది తన నివేదనగా భావించాలి.
కోవిడ్ కలిపిన బంధం:
రెండేళ్ల పాటు కోవిడ్ గడగడలాడించింది. ఇటవల అన్ని భయాలు తొలగిపోయాయి. అయితే COVID-19 మహమ్మారి మమ్మల్ని మరింత దగ్గర చేసిందని తన కుటుంబం గురించి పీసీ వెల్లడించింది. మేం కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి బంధాన్ని బలోపేతం చేయడానికి వీలు కల్పించిందని పీసీ తెలిపింది. నిక్ ఈ సెంటిమెంట్‌ను కొనసాగించాడు. మహమ్మారి మారువేషంలో ఒక ఆశీర్వాదం అని కూడా అతడు నొక్కిచెప్పాడు. ఎందుకంటే ఈ ఖాళీ సమయం జంటల మధ్య మరింత లోతైన అనుబంధానికి పునాది వేసిందని నిక్ నమ్ముతాడట.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సెలబ్రిటీ అయిన ప్రియాంక చోప్రా జోనాస్ మీడియా పుకార్లకు కొత్తేమీ కాదు. నేను అందరిలాగే రొటీన్ జీవితం గడుపుతానని కూడా పీసీ నిక్కచ్చిగా ఒప్పుకుంది. ఉదయం డ్యూటీ కోసం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లేదా నేను కాఫీ తాగుతున్నప్పుడు, నేను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లలో వార్తలను చదివేందుకు తిరగేస్తున్నప్పుడు.. అందరిలానే నేనూ ఉంటాను. అలాగే ప్రజలు ఎలాంటి కామెంట్లు చేసినా వాటికి ప్రతిస్పందించకూడదని, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేయకూడదని కూడా పీసీ భావిస్తుందట.