Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ ముక్కు ముఖం ప‌గిలి

పీసీ తాజాగా షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో ప్రియాంక యాక్షన్ సినిమాలు చేయడం వెనుక ఉన్న 'గ్లామ్' ఇలా ఉంటుంది అంటూ వ్యంగ్య వ్యాఖ్య‌ను జోడించింది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 1:13 PM GMT
స్టార్ హీరోయిన్ ముక్కు ముఖం ప‌గిలి
X

తన కుమార్తె మాల్తీ మేరీ తో పాటు ప్రియాంక చోప్రా జోనాస్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ చిత్రం 'ది బ్లఫ్' షూటింగ్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా పీసీ ఆస్ట్రేలియాలో విహ‌రిస్తూ, లేదా సెట్ల నుంచి ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తున్నారు. ఇప్పుడు పీసీ ఒక సినిమాలో యాక్ష‌న్ పార్ట్ తెర‌కెక్కించ‌డం వెనుక క‌ష్టం గురించి వెల్ల‌డించేందుకు ఒక స్నీక్ పీక్‌ను షేర్ చేసింది. ముఖ్యంగా తీవ్రమైన యాక్షన్ సన్నివేశాల కోసం ఎలా శ్ర‌మించాలో కూడా వెల్ల‌డించింది.

పీసీ తాజాగా షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో ప్రియాంక యాక్షన్ సినిమాలు చేయడం వెనుక ఉన్న 'గ్లామ్' ఇలా ఉంటుంది అంటూ వ్యంగ్య వ్యాఖ్య‌ను జోడించింది. పీసీ ముఖంపై రక్తం చిమ్మి ఉంది. ముక్కు నుంచి ర‌క్తం కారుతుండ‌గా చెంప‌ల‌పైనా ర‌క్తం క‌మ్మేసింది. రిస్కీ హై-ఆక్టేన్ యాక్ష‌న్ సన్నివేశాలను తెర‌కెక్కించేప్ప‌టి దృశ్యం ఇలా ఉంటుంద‌ని పీసీ తెలిపింది. ఇంతకుముందు కూడా త‌న‌ మెడ భుజంపై గాయాలు అయిన‌ట్టు ఉన్న‌ ఫోటోలను షేర్ చేసింది. త‌న శరీరంపై గాయాలు, చేతులు కాళ్ల‌పై వాటి ఆన‌వాళ్ల‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

అయితే వీటితో పాటు ప్రియాంక ఆన్ లొకేష‌న్ సరదా క్షణాలను కూడా షేర్ చేసింది. వాటిలో ఒకదానిలో పీసీ కుమార్తె మాల్తీ భారీ గాగుల్స్‌తో ఆడుకుంటూ క‌నిపించింది. అలాగే చిత్ర‌ బృందంతో పీసీ పార్టీ చేసుకుంటున్న వీడియోలు వైర‌ల్ అయ్యాయి. సెట్లో ఉన్న‌ప్పుడు సీరియ‌స్ యాక్ష‌న్ మోడ్ లో క‌నిపించే పీసీ విధుల్ని వ‌దిలేశాక ఎంతో జోవియ‌ల్ గా సెల‌బ్రేష‌న్ లో ఉంటుంద‌ని ఈ ఫోటోలు వీడియోలు చెబుతాయి.

19వ శతాబ్దానికి సంబంధించిన క‌థ‌తో రూపొందుతున్న‌ 'ది బ్లఫ్' ఒక ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్. ఇందులో ప్రియాంక చోప్రా జోనాస్ మాజీ పైలట్‌గా నటించారు. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు పీసీ- కార్ల్ అర్బన్‌లతో పాటు ఈ చిత్రంలో ఇస్మాయిల్ క్రజ్ కోర్డోవా, సఫియా ఓక్లీ-గ్రీన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనిని రస్సో సోదరులు నిర్మిస్తున్నారు. మ‌రిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది. బాలీవుడ్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఫ‌ర్హాన్ నిర్మించే 'జీలే జ‌రా'లో పీసీ న‌టించాల్సి ఉండ‌గా ఆల‌స్య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. PC పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో సినిమాల‌ను నిర్మిస్తోంది. ఇది ప్రధానంగా ప్రాంతీయ కంటెంట్‌పై దృష్టి సారించే బ్యాన‌ర్. 2021లో తన సొంత హెయిర్‌కేర్ లైన్ అనోమలీని కూడా పీసీ ప్రారంభించింది.