Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : తెల్ల చీరలో అందాల కలువ!

అంతర్జాతీయ వేదికపై హాట్ అందాలు ఆరబోసే ఈమె ఈసారి చీర కట్టు లో కన్నుల విందు చేసింది. అది కూడా తెల్లటి చీర అవ్వడం వల్ల కంటికి ఇంపుగా ఉందంటూ నెటిజన్స్ తెగ లైక్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:59 PM GMT
పిక్ టాక్‌ : తెల్ల చీరలో అందాల కలువ!
X

బాలీవుడ్‌ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గత కొన్నాళ్లుగా హాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుని గ్లోబల్ స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇంగ్లీష్ సినిమా ల్లో సిరీస్‌ ల్లో ఈ స్టార్ ఇమేజ్ దక్కించుకున్న ఘనత ఇండియా నుంచి ప్రియాంక చోప్రాకి మాత్రమే దక్కుతుంది.


ఈ అమ్మడు అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకోవడంతో అంతర్జాతీయ మీడియాలో రెగ్యులర్‌ గా ఉంటుంది. ఈమె ధరించే డ్రెస్ ల గురించి ఎప్పుడూ కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈమె ధరించిన ఔట్‌ ఫిట్ విషయం లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


అంతర్జాతీయ వేదికపై హాట్ అందాలు ఆరబోసే ఈమె ఈసారి చీర కట్టు లో కన్నుల విందు చేసింది. అది కూడా తెల్లటి చీర అవ్వడం వల్ల కంటికి ఇంపుగా ఉందంటూ నెటిజన్స్ తెగ లైక్‌ చేస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల వయసు చీర కట్టు అందాలు చూపిస్తున్న ప్రియాంక చోప్రా ఇందుకే గ్లోబల్‌ స్టార్ అయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చీర కట్టు కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం లో ప్రియాంక చోప్రా కీలకంగా వ్యవహరిస్తుందని దీంతో మళ్లీ నిరూపితం అయ్యింది. తెల్లటి చీర కట్టు అందాలను చూపిస్తున్న అందాల కలువ ఫోటోలు అంతర్జాతీయ వేదికపై వైరల్‌ అవుతూ ఉండటం ఇండియన్స్‌ అందరికి గర్వకారణం. ముందు ముందు ప్రియాంక చోప్రా ఇలాంటి మరిన్ని ఫోటో షూట్స్ ముఖ్యంగా చీర కట్టు ఫోటో షూట్స్ లో కనిపించాలని కోరుకుందాం.