Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బెర్రీ కోక‌లో PC వీపందం చూడు

OG దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జోనాస్ కి ఈ కస్టమ్ మేడ్ డిజైన‌ర్ డ్రెస్ ని ఎవ‌రు రూపొందించారు? అంటే ది గ్రేట్ మనీష్ మల్హోత్రా అని కూడా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 4:25 AM GMT
ఫోటో స్టోరి: బెర్రీ కోక‌లో PC వీపందం చూడు
X

వీపు చూడు.. వీపందం చూడు..! ఇక్క‌డ గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఫోజ్ చూశాక ఫ్యాన్స్ ఇలా కామెంట్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా బెర్రీ రెడ్ చీర‌లో షో స్టాప‌ర్ గా నిలిచింది. అయితే ఈ గెట‌ప్ తో ఎక్క‌డ మెరిసింది? అని ప్ర‌శ్నిస్తే.. త‌న సోద‌రుడు సిద్ధార్థ్ పెళ్లికి అటెండ‌యిన పీసీ ఇలా వేడుక ఆద్యంతం సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ గా నిలిచారు. ఈ వేడుక‌కు భారీగా సినీసెల‌బ్రిటీలు అటెండ‌య్యారు.


OG దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా జోనాస్ కి ఈ కస్టమ్ మేడ్ డిజైన‌ర్ డ్రెస్ ని ఎవ‌రు రూపొందించారు? అంటే ది గ్రేట్ మనీష్ మల్హోత్రా అని కూడా చెబుతున్నారు. ఆమె స్టైలిస్ట్ అమీ పటేల్ ఇన్‌స్టాలో ``పీసీలీషియస్ బెర్రీలిషియస్`` అని రాసింది. నీష్ డిజైన‌ర్ లుక్ సౌందర్యాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు. బోల్డ్ అండ్ బెర్రీలీషియస్ కస్టమ్ మేడ్ చీర అదే రంగులో 3D ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో పీసీ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. ఈ చీర కూడా 3D ఎంబ్రాయిడరీ టోన్‌ను కలిగి ఉంది.


ప్రియాంక తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుకల కోసం ఈ చీరను ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించార‌ని స‌మాచారం. ఆ ఒక్క లుక్కుతో పెళ్లిలో అహూతుల‌ను పీసీ కిల్ చేసింది. బెర్రీ చీరలో రియ‌ల్ స్ట‌న్న‌ర్ గా మెరిసిపోయింది. ప్రియాంక ధ‌రించిన ఆభ‌ర‌ణాలు అంతే ఖ‌రీదైన‌వి. ఆక‌ర్ష‌ణీయ‌మైన‌వి.. చోకర్ -ముత్యాలు, కెంపులు -వజ్రాలతో అలంకరించిన‌ లేయర్డ్ నెక్లెస్, డైమండ్ బ్రాస్‌లెట్‌తో కూడిన బ‌ల్గారి ఆభరణాలతో తన రూపాన్ని మరింత మెరుగుపరిచింది. రీగల్ సెట్ లో ప్రియాంక దేశీ గ్లామ్ లుక్ హీట్ పెంచింది. 2024లో మరో అద్భుత‌మైన మూవ్ మెంట్ ఇది అంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. సెలబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్‌కు ప్రియాంక వైబ్‌ని ఎలా సెలబ్రేట్ చేయాలో సూప‌ర్బ్ గా తెలుసు! అని కూడా కితాబిచ్చేస్తున్నారు.


సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఫ్లోరియన్ హురెల్ రూపొందించిన రెట్రో హై మెస్సీ బన్ హెయిర్ స్టైల్ ప్రియాంక లుక్ కి మ‌రో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. సిగ్నేచర్ బోల్డ్ లిప్ కలర్‌తో స్టైలిష్ లుక్‌ని వంద‌శాతం ఫుల్ ఫిల్ చేసింది పీసీ.


ఇన్‌స్టాలో షేర్ చేసిన‌ ఫోటోలలో తన ప్రియమైన స్నేహితురాలు తమన్నా దత్ కూడా పాస్టెల్ చీరను ధరించి క‌నిపించింది. `బెర్రీస్ అండ్ క్రీమ్` అనే క్యాప్ష‌న్ ని ఈ చీర‌కు ఇచ్చింది. చాలా సంవత్సరాలుగా ప్రియాంక మనీష్ డిజైన్‌లను ఉప‌యోగిస్తోంది. అత‌డు రూపొందించే అద్భుతమైన డిజైన‌ర్ దుస్తుల్లో చీరకు స్థిర‌మైన స్థానం ఉంది. దోస్తానా చిత్రంలోని `దేశీ గర్ల్‌` పాటలో పీసీ ధరించిన ఖ‌రీదైన చీర‌ను మ‌నీష్ రూపొందించాడు.


నీలం ఉపాధ్యాయతో నిశ్చితార్థం చేసుకున్న ప్రియాంక సోదరుడు ఏప్రిల్ 2024లో రోకా వేడుకను జరుపుకున్నారు. ఈ వేడుకకు ప్రియాంక, నిక్ జోనాస్ , వారి కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్ హాజరయ్యారు.