జయం రవితో పెళ్లి వార్తలపై హీరోయిన్ స్పందన
స్టార్ హీరో జయం రవితో పూలదండలు మార్చుకుంటున్న ఫోటో ఒకటి వెబ్ లో కనిపించడంతో నిశ్చితార్థం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 26 Oct 2024 6:34 AM GMTప్రియాంక అరుల్ మోహన్ పరిచయం అవసరం లేదు. తెలుగు హీరో నాని సరసన పలు చిత్రాల్లో నటించింది. ఇటీవలే `సరిపోదా శనివారం`తో హిట్టందుకున్న ఈ బ్యూటీ తదుపరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన `OG`లో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు తమిళంలోను పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వాటిలో ఒకటి `బ్రదర్`. ఈ సినిమాలో జయం రవి సరసన ప్రియాంక కథానాయికగా నటించింది.
ఇప్పుడు తన ఎంగేజ్‌మెంట్‌పై వస్తున్న రూమర్‌లపై క్లారిటీ ఇచ్చింది. స్టార్ హీరో జయం రవితో పూలదండలు మార్చుకుంటున్న ఫోటో ఒకటి వెబ్ లో కనిపించడంతో నిశ్చితార్థం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే వైరల్ అయిన ఫోటోగ్రాఫ్ ఈ అందమైన జంట నటిస్తున్న `బ్రదర్` చిత్రం ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించినది అని తెలిసింది.
నిజానికి సినిమా లాంచింగ్ వేడుకల్లో .. తమిళ చిత్ర పరిశ్రమలో పూల మాలలు ధరించడం పరిపాటి. బ్రదర్ ప్రారంభోత్సవ వేడుకలో నటీనటులు, సాంకేతిక నిపుణులు పూలమాలలు ధరించారు. ఈ సంప్రదాయం గురించి తెలియక ప్రజలు తికమకపడ్డారు.. అది నిజమైన వివాహ వేడుక లేదా నిశ్చితార్థ వేడుక అనుకుని పొరబడ్డారు.
ప్రియాంక మోహన్ - జయం రవి పూలమాలలు ధరించి కనిపించడంతో నిశ్చితార్థం గురించి పుకార్లు వచ్చాయి. అంతేకాదు ఇటీవలే జయం రవి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ప్రియాంకతో జయం రవి నిశ్చితార్థం అంటూ ప్రచారం సాగడం ఆశ్చర్యపరిచింది.
జయం రవితో వైరల్ ఫోటోపై ప్రియాంక మోహన్ తాజా చాటింగ్ సెషన్ లో స్పందిస్తూ... దాని గురించి చాలా ఆలస్యంగా విన్నాను. ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌లు ఇలాంటి ఫోటోలు వీడియోలను మీడియాకు షేర్ చేయడం మానేయాలని, అవి తప్పుడు అభిప్రాయాలను సృష్టిస్తాయని అన్నారు. దీంతో ఆ ఇద్దరి మధ్యా ఎలాంటి బాంధవ్యం లేదని స్పష్ఠత వచ్చింది.