Begin typing your search above and press return to search.

ప్రియాంక.. ఓ ఇన్నోసెంట్ పోలీస్!

నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్ కు ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ పరిచయమైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 July 2024 5:38 PM GMT
ప్రియాంక.. ఓ ఇన్నోసెంట్ పోలీస్!
X

నేచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్ కు ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ పరిచయమైన విషయం తెలిసిందే. ఫస్ట్ సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. తక్కువ చిత్రాల్లోనే నటించినా.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. కానీ అనుకున్న స్థాయిలో హిట్లు కొట్టలేకపోయింది. దీంతో కోలీవుడ్ కు వెళ్లి వరుస సినిమాల్లో నటిస్తోంది. అక్కడి స్టార్ హీరోలు శివ కార్తికేయన్, ధనుష్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పిస్తోంది.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు గాను హీరోయిన్ గా ఎంపికై టాప్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీతో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఓజీతో పాటు తెలుగులో తన ఫస్ట్ సినిమా హీరో నానితో కూడా వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సరిపోదా శనివారం మూవీ తెరకెక్కుతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే సినీ ప్రియులతో పాటు నాని ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ కూడా అందుకు తగ్గట్లు ప్రమోషన్స్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ.. ప్రతి శనివారం ఏదో ఒక అప్డేట్ తో సందడి చేస్తున్నారు. వరుసగా సాంగ్స్, పోస్టర్లు రిలీజ్ చేస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే సినిమాలో నాని.. సూర్యగా కనిపించనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. తాజాగా ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు.

సినిమాలో చారులతగా ప్రియాంక నటిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇన్నోసెంట్ పోలీస్ గా ఆమెను పరిచయం చేశారు. పోలీస్ యూనిఫామ్ ధరించిన అమ్మడు.. భూజానికి బ్యాగ్ వేసుకుని రోడ్డుపై నడుస్తున్నట్లు చూపించారు. ఆమె ముఖంలో చిరునవ్వు అందరినీ ఆకట్టుకుంటోంది. పోలీస్ అధికారి అయినా.. కూల్ గా కనిపిస్తోంది బ్యూటీ. మూవీలో ప్రియాంక పోషిస్తున్న చారులత రోల్ కీలకంగా ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా క్లారిటీ వచ్చేసింది.

సరిపోదా శనివారం మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఎస్‌ జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టు 29వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాతో ప్రియాంక ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.