Begin typing your search above and press return to search.

ఉద‌యాన్నే లేవ‌ను..జిమ్ కి వెళ్ల‌ను!

హీరోయిన్లు అంతా ఎంత అందంగా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకు కార‌ణం నిత్యం ఫిట్ నెస్ ని కాపాడు కోవ‌డం.

By:  Tupaki Desk   |   5 Jun 2024 2:30 PM GMT
ఉద‌యాన్నే లేవ‌ను..జిమ్ కి వెళ్ల‌ను!
X

హీరోయిన్లు అంతా ఎంత అందంగా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకు కార‌ణం నిత్యం ఫిట్ నెస్ ని కాపాడు కోవ‌డం. ఉదాయాన్నే నిద్ర లేచి ర‌న్నింగ్..వాకింగ్ లు చేయ‌డం. జిమ్..యోగాలు చేయ‌డం. ప‌ర్పెక్ట్ డైట్ ఫాలో అవ్వ‌డం. ఇది సెల‌బ్రిటీ లైఫ్ స్టైల్లో ఓ భాగం. సెల‌బ్రిటీలు అంటే ఇలాగే ఉండాలి అని ఓ రూల్ కూడా రాసి పెట్టుకున్నారు. అందుకే 50 ఏళ్లు వ‌చ్చినా అంత బ్యూటీగా క‌నిపిస్తుంటారు అన్న‌ది వాస్త‌వం.


మ‌రి ఉద‌యం లేవ‌కుండా..జిమ్ కి వెళ్లకుండా అందంగా ఉండే హీరోయిన్లు ఎవ‌రైనా ఉన్నారంటే? ముందుగా ఈ భామ పేరుచెప్పాల్సి ఉంటుందేమో. ఆమె ఎవ‌రో కాదు ప్రియాంక మోహ‌న్. ఈ బ్యూటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అంద‌మే అసూయ ప‌డేంత అందం ఆమె సొంతం. పాల‌నురుగుల సౌంద‌ర్యం. ఆ క‌ళ్లు.. ముక్కు... క‌ను బొమ్మ‌లు ఇలా ఒకటేంటి? ప్రియాంక అందానికి ఫిదా కాని కుర్రాళ్లంటూ ఉండ‌రు. మ‌రి ఇదంతా ఎలా సాధ్య‌మంటే చెప్ప‌డం క‌ష్టం.

ఎందుకంటే ఆ సీక్రెట్ మాత్రం చెప్ప‌లేదు. అంద‌రిలా తాను జిమ్ కి వెళ్ల‌న‌ని...పని ఉంటే త‌ప్ప ఉదయాన్నే నిద్ర‌లేచే టైప్ కాదు అని తెలిపింది. దీంతో ఇదేదో బాగుందే ? అంటూ అంద‌రూ ఆమెను గ‌నుక ఫాలో అయ్యేరు. బొక్క‌బోర్లా ప‌డ‌తారు. హీరోయిన్ కాబ‌ట్టి ఆమె తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు తీసేసుకుంటుంది. ఉద‌యాన్నే లేవ‌ల‌నే కండీష‌న్ పెట్టుకోకుండా బ్యూటీకి సంబంధించి ఇత‌ర వేళ‌ల్లో స‌మ‌యాన్ని కేటాయిస్తుంది. కుర్రాళ్ల‌కే ఇలా చ‌మ‌త్కారాలు విసురుతుంది.

ఇక టాలీవుడ్ లో ఈ బ్యూటీ జ‌ర్నీ గురించి తెలిసిందే. నాని` గ్యాంగ్ లీడ‌ర్` సినిమాతో అమ్మ‌డు తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. అటుపై `శ్రీకరం` అనే సినిమాలో న‌టించింది. ఈ రెండు సినిమాలు కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో ప్రియాంక కొన్నాళ్లు త‌మిళ్ సినిమాలే చేసింది. ప్ర‌స్తుతం నానితోనే మ‌ళ్లీ `సరిపోదా శ‌నివారం` అనే సినిమా చేస్తోంది. త‌మిళ్ లో బ్ర‌ద‌ర్ అనే సినిమా చేస్తోంది.