ప్రియాంక చోప్రా 'పానీ'కి ఐదేళ్ల కి మోక్షం!
తాజాగా ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ సినమా అప్ డేట్ తో ప్రియాంక ముందుకొచ్చింది.
By: Tupaki Desk | 21 Aug 2024 12:30 AM GMTగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిగానే కాదు నిర్మాతగానూ రాణిస్తోన్న సంగతి తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ఇప్పటికే కొన్ని సక్సెస్ పుల్ చిత్రాలు నిర్మించారు. హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు నిర్మించారు. `వెంటిలేటర్`, `సర్వణ్` ,` ది స్కై ఈజ్ పింక్`, `ది వైట్ టైగర్` లాంటి సినిమాలు నిర్మించారు. ఇదే సమయంలో 2019 లోనే `పానీ` అనే ఓ మరాఠీ చిత్రాన్ని కూడా మొదలు పెట్టారు.
అద్దినాథ్ ఎం. కొఠారే దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఇంతవరకూ రిలీజ్ అవ్వలేదు. తాజాగా ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ సినమా అప్ డేట్ తో ప్రియాంక ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం అమ్మడు రాజశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి పనిచేసింది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 18 2024న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిచింది.
`ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. మా మరాఠీ చలన చిత్రం పానీ అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లలో కలుద్దాం` అని రాసుకొచ్చింది. అయితే ఈ సినిమాని ఇంత కాలం ఏ కారణంగా వాయిదా వేస్తున్నారు? అన్నది మాత్రం పీసీ రివీల్ చేయలేదు.
ఈ కథ విషయానికి వస్తే మహరాష్ట్రలో నీటి సమస్యని హైలైట్ చేస్తూ తీసిన చిత్రమిది. నగర్ వాడీ అనే గ్రామంలో నీటి ఎద్దడి కారణంగా చాలా మందికి వివాహం కాదుట. అందులో ఒక వ్యక్తి జీవిత కథకి దృశ్య రూపం ఇస్తున్నట్లు సమాచారం.
ఇందులో నితిన్ దీక్షిత్ రచించిన పానీలో అద్దినాథ్ ఎం. కొఠారే, రుచా వైద్య, సుబోధ్ భావే, రజిత్ కపూర్, కిషోర్ కదమ్, నితిన్ దీక్షిత్, సచిన్ గోస్వామి, మోహనాబాయి, శ్రీపాద్ జోషి, వికాస్ పాండురంగ్ పాటిల్ వంటి ప్రముఖ నటీనటులున్నారు.