ఎర్రకోక డిజైనర్ బ్లౌజులో కిర్రెక్కిస్తోంది!
అయితే ఈ ఆరేళ్ల కెరీర్ లో ప్రియా ఏం నేర్చుకుంది? అంటే నటిగా వృత్తిపరంగా అలాగే వ్యక్తిగతంగా ఉత్తమంగా మారిందని అభిమానులు అంటున్నారు.
By: Tupaki Desk | 24 Jun 2024 4:44 AM GMTపాతికేళ్ల వయసు.. కేవలం ఆరేళ్ల కెరీర్ లో ప్రియాప్రకాష్ వారియర్ సాధించినదేమిటి? అంటే.. నటిగా పరిణతి చెందింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంతో మలయాళంలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ వింక్ గాళ్ గా పాపులరైన సంగతి తెలిసిందే. ఒకే ఒక్క కన్ను గీటుడు దృశ్యంతో ఈ బ్యూటీ అనంతంగా హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఎప్పటికీ తనను వింక్ గాళ్ అని పిలవనిదే .. ఏదీ ముందుకు సాగదు.
అయితే ఈ ఆరేళ్ల కెరీర్ లో ప్రియా ఏం నేర్చుకుంది? అంటే నటిగా వృత్తిపరంగా అలాగే వ్యక్తిగతంగా ఉత్తమంగా మారిందని అభిమానులు అంటున్నారు. మునుపటితో పోలిస్తే తనలో పరిణతి ఎంతగానో పెరిగింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోను ప్రియా ప్రకాష్ జరంత జోరుగా ఉంది. ఇటీవల బోల్డ్ ఫోటోషూట్లతో యువతరాన్ని ఆకర్షిస్తోంది. గ్లామర్ డాళ్ పాత్రలతో పాటు నటిగా నిరూపించుకునే అవకాశాల కోసం వేచి చూస్తోందట.
ప్రియా ప్రకాష్ ఓవైపు పెద్ద తెర అవకాశాలు.. మరోవైపు ఓటీటీ అవకాశాల్ని ప్రియా ఒడిసిపట్టుకుంటోంది. ఇంతకుముందు యువహీరో నితిన్ సరసన అంధాధున్ రీమేక్ లో అవకాశం అందుకున్న ప్రియా ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాల కోసం వేచి చూస్తోంది. ఇంతలోనే ప్రియా స్టన్నింగ్ క్యాచీ ఫోటోషూట్లు నెట్ ని షేక్ చేస్తున్నాయి. తాజాగా ప్రియా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ ఎంతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. డిజైనర్ బ్లౌజ్, రెడ్ శారీలో ప్రియా ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.