Begin typing your search above and press return to search.

వింక్ బ్యూటీ స‌మ్మోహ‌న రూపం

ప్రియా ఈ స‌మ్మోహ‌న రూపం ప్ర‌స్తుతం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు ఈ ఫోటోషూట్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 4:19 AM GMT
వింక్ బ్యూటీ స‌మ్మోహ‌న రూపం
X

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ భామకు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌ల హ‌ద్దులు చెరిపేసి గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ప్రియా ఇటీవ‌లి ఫోటోషూట్లు అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా మ‌రోసారి వింక్ క్వీన్ అందరినీ మైమ‌రిపించే వేష‌ధార‌ణ‌తో క‌నిపించింది.


ప్రియా లేటెస్ట్ లుక్ వెబ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. త‌న అందం.. మ‌నోహ‌ర‌మైన రూపానికి త‌గ్గ‌ట్టుగా ప‌సుపు రంగు డిజైన‌ర్ టాప్, మ్యాచింగ్ బాట‌మ్ తో క‌నిపించింది. ప్రియా ఈ స‌మ్మోహ‌న రూపం ప్ర‌స్తుతం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు ఈ ఫోటోషూట్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రియా డిజైన‌ర్ లుక్, మ‌త్త‌యిన రూపానికి ఆకర్షితులయ్యారు. ఒక నెటిజ‌న్ ఇలా వ్రాశారు! మీరు చాలా అందంగా ఉన్నారు మై క్వీన్ " అని ప్ర‌శంసించాడు. చాలామంది ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు.


ప్రియా ప్రకాష్ వారియర్ న‌టించిన ఒరు ఆధార్ ల‌వ్ తెలుగులో అనువాద‌మై విడుద‌లైంది. ఆ త‌ర్వాత నితిన్ స‌ర‌స‌నా ఈ భామ ఓ చిత్రంలో నటించింది. చివరిగా తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీప‌న్ ప్లేతో సముద్రకని దర్శకత్వం వహించిన 'బ్రో' చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న‌ కనిపించింది. సముద్రకని దర్శకత్వం వహించిన 2021 తమిళ చిత్రం వినోదయ సితం కి అధికారిక తెలుగు రీమేక్ ఇది. ప్రియా ప్రకాష్ వారియర్ న‌టించిన 'యారియాన్ 2' ఇటీవ‌ల విడుద‌లైంది. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'బెంగుళూరు డేస్'కి హిందీ అధికారిక రీమేక్ చిత్ర‌మిది.


ప్రియా ప్రకాష్ వారియర్ ఎవరు?

12 సెప్టెంబర్ 1999న కేరళలోని పున్‌కున్నంలో జన్మించిన ప్రియా ప్రకాష్ వారియర్ భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోను ల‌క్ష‌లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఈజిప్ట్ - పాకిస్తాన్ వంటి దేశాలలోను అభిమానులు ఉన్నారు. ఈ బ్యూటీ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ఇన్‌స్టాగ్రమ్‌లో భారీ ఫాలోయింగ్ ని క‌లిగి ఉంది. ఫేస్‌బుక్‌లో 3.2 మిలియన్లకు పైగా అభిమానులను సంపాదించింది. కేవలం ఒక కనుసైగతో ఆమె ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఒరు ఆధార్ ల‌వ్ చిత్రంలో న‌టించాక‌ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రియ త్రిసూర్‌లోని విమల కాలేజీలో బి.కామ్ చ‌దువుకుంది.