Begin typing your search above and press return to search.

ఆ దేవుడిచ్చిన ఊహించ‌ని రంగుల జీవితం నాది!

ప్రియా వారియ‌ర్ కెరీర్ లో ఇప్పుడెంత బిజీగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ సినిమాలు కూడా కాదు. ఏకంగా బాలీవుడ్ సినిమాలే చేస్తోంది.

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:30 PM GMT
ఆ దేవుడిచ్చిన ఊహించ‌ని రంగుల జీవితం నాది!
X

ప్రియా వారియ‌ర్ కెరీర్ లో ఇప్పుడెంత బిజీగా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. సౌత్ సినిమాలు కూడా కాదు. ఏకంగా బాలీవుడ్ సినిమాలే చేస్తోంది. ప్రస్తుతం అమ్మ‌డి లైన‌ప్ లో చాలా సినిమాలున్నాయి. వ‌చ్చిన ఏ అవ‌కాశం విడిచిపెట్ట‌లేదు. అలాగ‌ని సౌత్ ని లైట్ తీసుకోలేదు. ఇక్క‌డా అందివ‌చ్చిన అవ‌కాశాలు అందు కుంటుంది. కానీ అమ్మ‌డి టార్గెట్ మాత్రం హిందీ ఇండ‌స్ట్రీపైనే క‌నిపిస్తుంది.

అక్క‌డ మార్కెట్ లో ఎలాగైనా నిల‌దొక్కుకోవాల‌ని గట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రి ఈర‌క‌మైన జీవితాన్ని ప్రియావారియ‌ర్ ఊహించిందా? అస‌లు తాన స్టార్ అవుతాన‌ని క‌ల‌లోనైనా అనుకుందా? అంటే లేద‌నే చెప్పాలి. ఈ మాట స్వ‌యంగా ప్రియావారియ‌ర్ చెప్పింది. 'చిన్న త‌నం నుంచి సినిమాలంటే ఆస‌క్తి ఉంది. అదే ఇంట్రెస్ట్ తో సినిమా చూసొచ్చి అద్దం ముందు ప్రాక్టీస్ చేసేదాన్ని.

కానీ నేను న‌టిని అవుతాన‌ని నా త‌ల్లిదండ్రులే కాదు ..నేను కూడా ఊహించ‌లేదు. చ‌దువుకుంటోన్న స‌మ‌యంలోనే ఆడిష‌న్ కి వెళ్లా. ఆ సినిమా పూర్తిచేయ‌డానికి త‌ల్లిదండ్రులు ప్రోత్స‌హించారు' అంది. మల‌యాళ చిత్రం 'ఒరు ఆదార్ లవ్' లో అమ్మ‌డు న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ప్లాప్ అయినా అందులో ట్రైల‌రే ప్రియా వారియ‌ర్ ని దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ చేసింది.

ఒక్క క‌న్ను గీటుతో యువ‌త‌లో క్రేజీ భామ‌గా మారిపోయింది. ఆ గీటుకు కుర్రాళ్లే కాదు...చాలా మంది సెల‌బ్రిటీ హీరోలు కూడా పిదా అయ్యారు. ఆ వీడియో నెట్టింట సంచల‌నం సృష్టించింది. ఆ వీడియోతోనే ప్రియా వారియ‌ర్ అంటే దే శ‌వ్యాప్తంగా అందిరికీ తెలిసిందే. ఆ క్రేజ్ తోనే సినిమాల్లో అవకాశాలు రావ‌డంతో నేడు రంగుల జీవితాన్ని ఆస్వాదిస్తుంది. కోట్ల‌లో పారితోషికంగా తీసుకుంటుంది. ఖ‌రీదైన కార్లు...అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసింది. తాను ఏమాత్రం ఊహించ‌ని జీవితం త‌న‌కి ద‌క్కింది. ఇలాంటి జీవితం ఉండాలంటే నిజంగా పెట్టి పుట్టాలి.