Begin typing your search above and press return to search.

దిల్ రాజుపై ఫుల్ ఒత్తిడి! అసలేం జరుగుతోంది?

సినీ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు మారిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Oct 2024 3:58 AM GMT
దిల్ రాజుపై ఫుల్ ఒత్తిడి! అసలేం జరుగుతోంది?
X

సినీ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు మారిన విషయం తెలిసిందే. యంగ్ హీరో నితిన్ దిల్ మూవీని తొలిసారి నిర్మించిన ఆయన.. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దిల్ రాజు గా పేరు తెచ్చుకున్నారు. దిల్ తర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించారు. కొన్నేళ్లుగా స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీని ఏలుతున్నారు!

అయితే దిల్ రాజు నిర్మించిన దాదాపు అన్ని సినిమాలు.. సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో కోట్లలో లాభాలు ఆర్జించారు. తక్కువ టైమ్ లోనే భారీ స్థాయిలో ఎదిగారు. స్టార్ ప్రొడ్యూసర్ గా మారినా.. డిస్ట్రిబ్యూషన్ ను విడిచిపెట్టలేదు. రెండు రంగాల్లో కూడా తన హవా చూపిస్తున్నారు. గత ఏడాది విజయ్ దళపతి వారసుడు మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్ నిర్మిస్తున్నారు.

ఇప్పుడు ఆ సినిమా విషయంలో దిల్ రాజు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మూడేళ్ల క్రితం చిత్రీకరణ మొదలవ్వగా.. త్వరలో పూర్తి కానుంది. కొన్ని రోజుల క్రితం దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ తో క్రిస్మస్ కు కలుద్దామని తెలిపారు. దీంతో డిసెంబర్ లో మూవీ రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

దీంతో సినిమా పోస్ట్ పోన్ అవుతుందని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించిన అన్ని హక్కులు జీ స్టూడియోస్ కు దిల్ రాజు ఇప్పటికే విక్రయించినట్లు తెలుస్తోంది. షూటింగ్ మొదలైన ఏడాది లోపే రిలీజ్ అవుతుందని భావించిన జీ స్టూడియోస్.. పెద్ద మొత్తం చెల్లించి హక్కులు దక్కించుకుందట. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఓటీటీ హక్కులు జీ స్టూడియోస్ విక్రయించినట్లు సమాచారం.

అయితే అఫీషియల్ గా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయకపోవడంతో దిల్ రాజు పై జీ స్టూడియోస్ సంస్థ బాగా ఒత్తిడి తీసుకొస్తుందని వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదల బాగా ఆలస్యం కావడంతో ఇప్పటికే ఖరారు చేసుకున్న డీల్ పై మళ్లీ చర్చిస్తున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పలు నిబంధనలు ప్రకారం దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ హక్కుల విషయంలో నష్టపోయే అవకాశం ఉందట! మరి ఈ విషయంలో నిజమెంత అనేది మాత్రం తెలియదు.