లేడీ ప్రొడ్యూసర్ పై పోక్సో కేసు!
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడింది. ఫోక్స్ చట్టం కింద ఆమెపై కేసు నమోదైంది.
By: Tupaki Desk | 21 Oct 2024 5:30 AM GMTబాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడింది. ఫోక్స్ చట్టం కింద ఆమెపై కేసు నమోదైంది. మైనర్ బాలికలకు సంబంధించిన వ్యవహారంలో తప్పుగా ప్రవర్తించింది అనే ఆరోపణతో ఆమె ముంబై పోలీసలు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే. ఓటీటీ ప్లాట్ ఫాం ఆల్ట్ బాలాజీలో ఏక్తా కపూర్ నిర్మించిన గంధీ బాద్ సీజన్-6 స్ట్రీమింగ్ అయింది. ఇది 2021 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య స్ట్రీమింగ్ అయింది.
ఇందులో మైనర్ బాలికలకు సంబంధించిన అభ్యంతరక సన్నివేశాలున్నాయని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు ఫోక్సో చట్టం కింద ఏక్తా కపూర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెతో పాటు ఆమె తల్లి శోభా కపూర్ కూడా కేసు లో భాగమయ్యారు. బాలాజీ టెలీ ఫిల్మ్స్ పై దీన్ని సంయుక్తంగా నిర్మించారు.
ప్రస్తుతం ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానప్పటికీ చట్టపరంగా అది తప్పుడు చర్య కావడంతో పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఓటీటీకి సెన్సార్ లేకపోవడంతో తీసిన సిరీస్ తీసినట్లుగా రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన సిరీస్ పై ఇప్పుడు అభ్యంతరాలు రావడంపై కొతం ఆశ్యర్యం వ్యక్తమవుతోంది. అప్పుడు తెరపైకి రాని అభ్యంతరాలు ఇప్పుడు రావడం ఏంటనే? సందేహం వ్యక్తమవుతుంది.
అయితే మైనర్ బాలికలపై అభ్యంతరకర సన్నివేశాలు అనేవి చట్టపరంగానే తప్పు. థియేటర్ రిలీజ్ అయితే వాటిని సెన్సార్ చేసే వారు. కట్ చేసిన అనంతరం రిలీజ్ చేసే వారు. ఓటీటీ రిలీజ్ కి సెన్సార్ లేదు కాబట్టి రిలీజ్ ఎలాగైనా చేయోచ్చు అన్న కోణంలో ఓటీటీలోకి తెచ్చారు. బాలీవుడ్ లో బోల్డ్ అటెంప్ట్ లు చేయడంలో ఏక్తా కపూర్ ఏమాత్రం వెనకడుగు వేయని నిర్మాతగా పేరుంది. ఇప్పుడదే ఆమెని వివాదంలోకి నెట్టింది.