Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఆ సినిమా ఓటీటీలో..!

ఆ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఎక్స్‌ లో అభిమానులతో మాట్లాడిన నిర్మాత జ్ఞానవేల్‌ ను పలువురు తంగలాన్‌ ఓటీటీ ఎప్పుడు అంటూ ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 4:09 PM GMT
ఎట్టకేలకు ఆ సినిమా ఓటీటీలో..!
X

తమిళ స్టార్ నటుడు చియాన్ విక్రమ్‌ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన 'తంగలాన్‌' సినిమాకు తమిళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తంగలాన్ సినిమాను థియేటర్‌ లో చూడలేక పోయిన వారు ఓటీటీ లో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తంగలాన్ సినిమా ఓటీటీ లో ఇప్పటి వరకు స్ట్రీమింగ్‌ కాలేదు. రెండు నెలలుగా ఓటీటీ ద్వారా ఈ సినిమాను చూడటం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు నిర్మాత జ్ఞానవేల్‌ గుడ్‌ న్యూస్ చెప్పారు. కంగువా సినిమా ప్రమోషన్‌లో ఆయన తంగలాన్ అప్‌డేట్‌ ఇచ్చారు.

కంగువా సినిమా నవంబర్‌ 14న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఎక్స్‌ లో అభిమానులతో మాట్లాడిన నిర్మాత జ్ఞానవేల్‌ ను పలువురు తంగలాన్‌ ఓటీటీ ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. నిర్మాతకి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కి మధ్య ఉన్న విభేదాల కారణంగా తంగలాన్ సినిమాను ఇప్పటి వరకు ఓటీటీ లో తీసుకు రాలేదు అనే టాక్ ఉంది. తమిళ్‌ కు చెందిన కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ అదే విషయాన్ని ప్రచారం చేస్తున్నాయి. దాంతో నిర్మాత జ్ఞానవేల్‌ స్పందించారు. తంగలాన్‌ వంటి భారీ సినిమాను ప్రత్యేకమైన రోజుల్లో విడుదల చేయాల్సిన అవసరం ఉంది.

తంగలాన్ సినిమాను ఎక్కువ మంది అభిమానులకు చేరవేసేందుకు గాను దీపావళి కానుకగా నెట్‌ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. అతి త్వరలోనే నెట్‌ ఫ్లిక్స్‌ నుంచి ఆ విషయమై క్లారిటీ రానుంది అంటూ ఆయన ప్రకటించారు. సోషల్‌ మీడియా ద్వారా ఇప్పటికే తంగలాన్ సినిమాను నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఇప్పుడు అదే విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. నెట్‌ ఫ్లిక్స్ మాత్రం ఇప్పటి వరకు తంగలాన్ సినిమా స్ట్రీమింగ్‌ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. తంగలాన్ సినిమా డిజిటల్‌ హక్కులను భారీ మొత్తానికి నెట్‌ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

సినిమా విడుదల తర్వాత ఫలితం నేపథ్యంలో నెట్‌ ఫ్లిక్స్ వారు ముందు అనుకున్న మొత్తాన్ని ఇచ్చేందుకు నిరాకరించారని, అందుకే ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్‌ కు నిర్మాతలు ఇవ్వలేదు అనేది ప్రచారం. కానీ తాజాగా నిర్మాత జ్ఞానవేల్‌ ఆ ప్రచారంను ఖండించారు. సరైన సందర్భం కోసం నెట్‌ ఫ్లిక్స్ వారు వెయిట్‌ చేస్తున్నారు. త్వరలోనే ప్రత్యేక సందర్భంగా ఓటీటీ లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో విక్రమ్ ను మూడు విభిన్నమైన పాత్రల్లో చూపించడం జరిగింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామా సినిమాకు జాతీయ అవార్డులు రావడం ఖాయం అంటూ విడుదల సమయంలో మేకర్స్ తెగ హడావుడి చేశారు. అందుకే ఓటీటీ లో స్ట్రీమింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దీపావళికి తంగలాన్ వస్తే కచ్చితంగా మంచి స్పందన దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.