ఫ్లాప్ హీరోతో నిర్మాత హైడ్ అండ్ సీక్!
విజయం దక్కకపోవడంతో అతడికి ఇచ్చే ట్రీట్ మారింది. ఇచ్చే గౌరవం కూడా తీసికట్టుగా మారింది.
By: Tupaki Desk | 7 Feb 2025 5:30 PM GMTబ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ఒకప్పుడు బంగారు బాతులా అందరినీ ఆదుకున్న ప్రముఖ హీరో ఇప్పుడు వరుసగా ఫ్లాపుల బాట పట్టడంతో అతడు పరిశ్రమలో చులకనయ్యాడు. హిట్టు మాత్రమే నిర్ణయించే పరిశ్రమలో అతడిని ఇప్పుడు హైడ్ చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత. విజయం దక్కకపోవడంతో అతడికి ఇచ్చే ట్రీట్ మారింది. ఇచ్చే గౌరవం కూడా తీసికట్టుగా మారింది.
అంతేకాదు.. సదరు స్టార్ హీరో నటించిన సినిమాని రిలీజ్ చేయాలా వద్దా? అని ఇప్పుడు హెడ్ అండ్ టెయిల్ టాస్ వేస్తున్నాడు. రిలీజ్ చేస్తే హిట్టవుతుందా లేదా? ఫట్టయితే పరిస్థితి ఏంటో! అంటూ లెక్కలు వేస్తున్నాడు. భారీ బ్లాక్ బస్టర్లు ఇచ్చినప్పుడు ఆ హీరోని నెత్తిన పెట్టుకున్న నిర్మాత ఇప్పుడు ఇలా చేయటం విచిత్రం.
అయితే ఇంతటితో ఇది ఆగిపోలేదు. ఇప్పుడు మరీ చులకనగా యానిమల్ బ్యూటీ ట్రిప్తి దిమ్రీ నటించిన మీడియం బడ్జెట్ చిత్రం 'ధడక్ 2' కోసం సదరు సూపర్ స్టార్ నటించిన బయోపిక్ చిత్రాన్ని వాయిదా వేసాడు. హోలీ కానుకగా 14 మార్చి 2025న రావాల్సిన ఈ చిత్రం ఏప్రిల్ కి వాయిదా పడింది. ఇప్పుడు హోలీకి ట్రిప్తి నటించిన ధడక్ 2 ని విడుదల చేస్తున్నాడు. అంటే ఒక అప్ కమ్ హీరోయిన్ కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా సదరు స్టార్ హీరోకి ఇవ్వడం లేదు.
రిలీజ్ విషయం లో ఈ గ్యాంబ్లింగ్ దేనికి? సదరు స్టార్ హీరోతో అగ్రనిర్మాత హైడ్ అండ్ సీక్ గేమ్ ఎందుకు ఆడుతున్నాడు? హీరోని రేసులో వెనక్కి ఎందుకు నెడుతున్నాడు? అన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? అంటే నిస్సందేహంగా ఫ్లాపులతో రేసులో వెనకబడిన అక్షయ్ కుమార్. అతడు నటించిన కేసరి 2 ని విడుదల చేయడానికి ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ చాలా ఆలోచిస్తున్నాడు. హీరోని కూడా డైలమాలోకి నెట్టేస్తున్నాడని చెబుతున్నారు.