Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ ఫ్రెండ్ నిర్మాత కేదార్ మృతి!

టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌కు స‌న్నిహిత మిత్రుడు, సినీనిర్మాత కేదార్ సెల‌గం శెట్టి దుబాయ్ లో ఆక‌స్మికంగా క‌న్ను మూసార‌ని క‌థ‌నాలొస్తున్నాయి

By:  Tupaki Desk   |   25 Feb 2025 3:35 PM GMT
అల్లు అర్జున్ ఫ్రెండ్ నిర్మాత కేదార్ మృతి!
X

టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల‌కు స‌న్నిహిత మిత్రుడు, సినీనిర్మాత కేదార్ సెల‌గం శెట్టి దుబాయ్ లో ఆక‌స్మికంగా క‌న్ను మూసార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అత‌డు గుండె పోటుతో మ‌ర‌ణించాడ‌ని ఒక వార్త షికార్ చేస్తోంది. అయితే అత‌డి ఆక‌స్మిక మ‌ర‌ణానికి స్ప‌ష్ఠ‌మైన కార‌ణం తెలియాల్సి ఉంది.

ఆనంద్ దేవరకొండ‌తో కేదార్ ఇటీవ‌ల‌ `గమ్ గమ్ గణేశ` అనే సినిమాని నిర్మించారు. అంత‌కుముందు అతడు `ముత్త‌య్య` అనే సినిమాకు స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. బన్నీ వాసు మార్గదర్శకత్వంలో సినిమాలు నిర్మించడానికి కేదార్ సెల‌గం శెట్టి పరిశ్రమలోకి ప్రవేశించారు. నిర్మాత‌గా అనుభవం కోసం ఆయన `గమ్ గమ్ గణేశ` యూనిట్ లో చేరారు. విజయ్ దేవరకొండ -సుకుమార్ కాంబినేష‌న్ లో మూవీని కూడా కేదార్ సెల‌గం శెట్టి నిర్మించాల్సి ఉంది. ఈ చిత్రం కోసం సుకుమార్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు.

అయితే యువ‌నిర్మాత కేదార్ ఆక‌స్మిక మ‌ర‌ణ‌ వార్త మొత్తం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. చురుకైన యువ నిర్మాత ఇంత చిన్న వ‌య‌సులో మ‌ర‌ణించ‌డంపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వార్త విన్న తర్వాత విజయ్ దేవరకొండ , ఆనంద్ దేవరకొండ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిర్మాత బన్నీ వాసుతో పాటు తమ స్నేహితుడిని చూడటానికి దేవ‌ర‌కొండ కూడా దుబాయ్ వెళ‌తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. చాలా చిన్న వయసులో యువ‌నిర్మాత‌ మరణించడంపై స‌న్నిహితులు తీవ్ర క‌ల‌త‌కు గుర‌వుతున్నారు. ఆయన మరణానికి కారణం ఇంకా స్ప‌ష్ఠంగా తెలియాల్సి ఉంది.