Begin typing your search above and press return to search.

జోక్ ను జోక్ లా చూడండి.. SKN మరో క్లారిటీ

టాలీవుడ్ నిర్మాత ఎస్ కే ఎన్.. తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రీసెంట్ గా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Feb 2025 10:43 AM GMT
జోక్ ను జోక్ లా చూడండి.. SKN మరో క్లారిటీ
X

టాలీవుడ్ నిర్మాత ఎస్ కే ఎన్.. తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రీసెంట్ గా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. తెలుగు రాని హీరోయిన్లను అభిమానిస్తామని.. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో అర్థమైందని రిటర్న్‌ ఆఫ్‌ డ్రాగన్‌ మూవీ ఈవెంట్ లో ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో సోషల్ మీడియాలో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. ఇప్పటికీ స్పందిస్తున్నారు కూడా.. కొందరు ఆయనపై ఫైర్ అయ్యారు. ఇంకొందరు వైష్ణవి చైతన్యను ఉద్దేశించి ఎస్ కే ఎన్ అలా కామెంట్ చేశారని అభిప్రాయపడ్డారు. దీంతో రీసెంట్ గా ఆయన సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు.

"హాహాహా.. ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు... ఏం చేస్తాం చెప్పండి.." అంటూ స్మైలీ ఎమోజీతో ఓ నెటిజన్ పోస్ట్ ను రీట్వీట్ చేశారు. ఇప్పుడు వీడియోను రిలీజ్ చేశారు. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తెలుగు ప్రతిభను పరిచయం చేయడానికి, మద్దతు ఇవ్వడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

"డ్రాగన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సరదాగా కామెంట్ చేశాను. దీంతో రకరకాలుగా రాసుకొచ్చారు. తెలుగమ్మాయిలను ఎక్కువ మందిని పరిచయం చేసిన అతి తక్కువ మంది నిర్మాతల్లో నేను ఒకరిని. రేష్మ, ఆనంది, ప్రియాంక జవాల్కర్, మానస, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత వీళ్లందరినీ ఇంట్రడ్యూస్ చేశా.. వర్క్ చేస్తున్నా" అని తెలిపారు.

"కొత్త సినిమాల ద్వారా హారికతో పాటు మరో అమ్మాయిని పరిచయం చేస్తాను.. ఇప్పటికే 8-9 మందిని ఇంట్రడ్యూస్ చేశాను. ఈషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఇనయా.. నా కెరీర్ లో 80 శాతం తెలుగు అమ్మాయిలతోనే పని చేశా. నేను తెలుగు జర్నలిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశా. అందుకే 25 మందిని తెలుగు అమ్మాయిలను పరిచయం చేయనున్నా" అని చెప్పారు.

"నా నెక్స్ట్ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ తెలుగు అమ్మాయి.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుగు అమ్మాయి.. రైటర్ తెలుగు అమ్మాయి.. అలా అంతమందిని పరిచయం చేస్తున్నా.. సరదాగా అన్న విషయాన్ని స్టేట్మెంట్ లా చూడొద్దు.. జోక్ ను జోక్ లా చూడండి.. నేను చేస్తున్నా.. చేయబోయే సినిమాల్లో మొదటి ప్రాధాన్యత తెలుగు అమ్మాయిలకే.. కాబట్టి ఎలాంటి తప్పుడు ప్రచారాలకు తావివ్వొద్దు" అని ఎస్ కే ఎన్ కోరారు.