ఆ హీరో ముఖం మీద నిర్మాత కొట్టినట్లే!
అనీస్ బజ్మీ యధావిధిగా దర్శకుడిగా కొనసాగుతున్నారు. అయితే హీరోగా మాత్రం అక్షయ్ కుమార్ ని తీసుకోనని నిర్మాత తెగేసి చెప్పేసారు.
By: Tupaki Desk | 12 Nov 2024 5:11 AM GMTఅక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా అనీస్ బజ్మీ తెరకెక్కించి 'సింగ్ ఈజ్ కింగ్' 16 ఏళ్ల క్రితం ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. 30 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన సినిమా అప్పట్లోనే 136 కోట్ల వసూళ్లను సాధించింది. అక్షయ్ కుమార్ కెరీర్ లో గొప్ప హిట్ చిత్రంగా నిలిచింది. ఈచిత్రాన్ని విపుల్ అమృతాల్ సాహా నిర్మించారు. అయితే ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ రీమేక్ హక్కుల్ని నిర్మాత శేలైంద్ర సింగ్ తీసుకున్నారు.
అనీస్ బజ్మీ యధావిధిగా దర్శకుడిగా కొనసాగుతున్నారు. అయితే హీరోగా మాత్రం అక్షయ్ కుమార్ ని తీసుకోనని నిర్మాత తెగేసి చెప్పేసారు. అక్షయ్ కుమార్ స్థానంలో రణవీర్ సింగ్ ని తీసుకుంటామన్నారు. ఎలాగైనా రణవీర్ ని ఒప్పించడానికి తన వంతు ప్రయత్నం చివరి వరకూ చేస్తానన్నారు. ఒకవేళ అతడు ఒప్పుకోకపోతే దిల్జీత్ సింగ్ ని తీసుకుంటానన్నారు. అక్షయ్ కుమార్ మాత్రం నటించే అవకాశం లేదని కరాఖండీగా చెప్పేసారు.
రణవీర్ సింగ్ తన మాట కాదనకుండా ఒప్పుకుంటారనే నమ్మకం ఉందన్నారు.' ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టాం. షేర్ సింగ్, కింగ్ -2, , సింగ్ ఈజ్ కింగ్ రిటర్న్స్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నాం' ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోవడానికి దాదాపు 12 ఏళ్లు పట్టింది. అంత ఈజీగా రైట్స్ నా వరకూ రాలేదు. అందుకైనా ఈసినిమాని కచ్చితగా హిట్ చేయాలి' అని అన్నారు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్ పుల్ ప్లాప్ ల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా విజయం అనేదే లేదు. విడుదలైన ప్రతీ సినిమా డిజాస్టర్ గా మారుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రాలు సైతం మినిమం వసూళ్లు కూడా సాధించడం లేదు. కనీసం ఓపెనింగ్ లు కూడా తేవడం లేదు. అందుకే సింగ్ ఈజ్ కింగ్ ని అక్షయ్ కుమార్ తో కాకుండా మరో హీరోతో ప్లాన్ చేసుకుంటున్నాడు సదరు నిర్మాత. అయితే అక్షయ్ కుమార్ చేతిలో చాలా సినిమాలున్నాయి.