Begin typing your search above and press return to search.

అనిల్ సుంకర.. ఎన్ని డిజాస్టర్స్ అంటే..

టాలీవుడ్ లో నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగించడం అందరికి సాధ్యం కాదు.

By:  Tupaki Desk   |   13 Aug 2023 5:07 AM GMT
అనిల్ సుంకర.. ఎన్ని డిజాస్టర్స్ అంటే..
X

టాలీవుడ్ లో నిర్మాతలుగా సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగించడం అందరికి సాధ్యం కాదు. ఇక్కడ వచ్చే నష్టాలని తట్టుకొని నిలబడాలి. ఒక సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలు తీసుకొస్తే వెంటనే రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యి కోట్లలో నష్టపోవాల్సి వస్తుంది. అయితే లెక్కలు సరిచేసుకుంటూ అన్ని రకాల బడ్జెట్ లలో సినిమాలు చేస్తూ వెళ్తే ఎక్కువ కాలం లీడ్ చేయవచ్చని దిల్ రాజు ప్రూవ్ చేశారు.

అలాగే రామానాయుడు, అల్లు అరవింద్ లాంటి వారు స్టార్ ప్రొడ్యూసర్స్ గా ఇప్పటికి కొనసాగుతున్నారు. అశ్వినీదత్ లాంటి స్టార్ నిర్మాత నష్టాల నుంచి గట్టెక్కడానికి కొన్నేళ్లు సినిమాలు చేయలేదు. ఇప్పుడు అనిల్ సుంకర గురించి మాట్లాడుకుంటే బాద్ షా సినిమాతో సినీ నిర్మాతగా తన కెరియర్ స్టార్ట్ చేశారు. స్టార్ హీరోలతో ఓ వైపు మూవీస్ చేస్తూనే మరో ఎండ్ లో లో బడ్జెట్ సినిమాలు కూడా చేస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు.

కెరియర్ లో చాలా ఫ్లాప్ సినిమాలు పడిన కూడా భారీగా నష్టాలు మాత్రం తీసుకురాలేదు. అయితే గత రెండేళ్లలో అనిల్ సుంకర నుంచి నాలుగు డిజాస్టర్స్ వచ్చాయి. చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాతో హిట్ కొట్టిన అనిల్ సుంకర తరువాత అల్లరి నరేష్ బంగారు బుల్లోడుతో డిజాస్టర్ పర్వం స్టార్ట్ అయ్యింది. వెంటనే మహా సముద్రం రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాతాలో పడింది. ఈ సినిమా భారీ లాస్ ని అందించింది.

ఈ ఏడాది అఖిల్ ఏజెంట్ సినిమా అయితే అనిల్ సుంకరని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈ చిత్రంతో ఏకంగా 50 కోట్ల వరకు ఆయన నష్టపోయారు. పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా రికవరీ రాలేదు. ఆ స్థాయిలో ఏజెంట్ నిర్మాతని దెబ్బతీసింది. మెగాస్టార్ భోళా శంకర్ సినిమాతో కోలుకుంటానని అనిల్ సుంకర హాప్ తో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న టాక్ చూస్తుంటే భారీ నష్టాలు తప్పేలా లేవనిపిస్తుంది.

వీకెండ్ కాబట్టి మొదటి మూడు రోజులు కొంత రికవరీ చేసే ఛాన్స్ ఉంది. లాంగ్ రన్ లో 50 శాతం రికవరీ వస్తే గ్రేట్ అని ట్రేడ్ పండితులు అంటున్నారు. జైలర్ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఆ మూవీ చూడటానికి మొగ్గు చూపిస్తున్నారు. మొత్తానికి వరుస నాలుగు డిజాస్టర్ లతో అనిల్ సుంకర కోలుకోలేని విధంగా నష్టాలు చవిచూశారని చెప్పొచ్చు.