Begin typing your search above and press return to search.

'ఆయ్' అంతా మన నేలపైనే!

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు ఇటీవల ఆయ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Aug 2024 4:27 PM GMT
ఆయ్ అంతా మన నేలపైనే!
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు ఇటీవల ఆయ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ నేపథ్యంతో తెరకెక్కించారు దర్శకుడు అంజి మణిపుత్ర. ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్ గా మారారు. GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

ఓ ముగ్గురు ఫ్రెండ్స్ చేసే అల్లరి, ప్రేమలో క్యాస్ట్ ప్రాబ్లమ్ ను సింపుల్ గా కామెడీతో ఆయ్ సినిమాను చూపించి మెప్పించారు మేకర్స్. తెలుగు సినీ ప్రియులను తమ మూవీతో అలరించారు. నార్నే నితిన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రలో ఒదిగిపోయారు. నయన్ సారిక సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అమ్మాయిగా గలగలా మాట్లాడుతూ మెప్పించింది. అయితే సినిమాలో విజువల్స్ చాలా అందంగా ఉన్నాయని చెప్పాలి. చాలా ఆహ్లాదకరమైన లొకేషన్స్ ను క్యాప్చర్ చేశారు మేకర్స్.

గోదావరి జిల్లాలకు చెందిన ఊళ్లలో షూట్ చేయడం, షూటింగ్ లో ఎక్కువ భాగం వర్షాకాలంలోనే తీయడంతో విజువల్స్ ఇంకా బాగున్నాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే తాజాగా ఈ విషయంపై నిర్మాత బన్నీ వాస్ మాట్లాడారు. "కేరళలో సినిమా షూట్ చేసి ఈస్ట్ గోదావరి అని అబద్దాలు చెబుతున్నామని అంటున్నారు. నేను 100 పర్సెంట్ నిజం చెబుతున్నా. సినిమాలో చూసిందంతా ప్యూర్ తెలుగు నేలనే" అని క్లారిటీ ఇచ్చారు.

"ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కొంత పార్ట్ హైదరాబాద్. ఈ మూడింటిలోనే సినిమా అంతా షూట్ చేశాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను దాటి ఎక్కడికి బయటకు వెళ్లింది లేదు. ఇంత మంది కొత్త టెక్నీషియన్స్, అప్ కమింగ్ టెక్నీషియన్స్ ను ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందుకే ముందుగా తెలుగు ప్రజలకు థ్యాంక్స్. థియేటర్ కు రండి. ఫన్ గ్యారెంటీ. జనాల్లో పాజిటివ్ టాక్ స్టార్ట్ అయింది. రండి హ్యాపీగా నవ్వండి.. నవ్వి నవ్వి నవ్వి వెళ్లండి" అని తెలిపారు బన్నీ వాస్.

ఇక ఆయ్ సినిమాలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి సహా పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తమ కామెడీతో ఫుల్ గా నవ్వించారు. హీరో తండ్రిగా వినోద్ కుమార్, హీరోయిన్ తండ్రిగా మైమ్ గోపి బాగా నటించారు. మిగతా యాక్టర్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మరి మీరు ఆయ్ సినిమాను చూశారా?