50 కోట్లు అంటే నిర్మాతకి సౌండ్ లేదా?
ఓ స్టార్ హీరోతో కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
By: Tupaki Desk | 17 May 2024 3:30 PM GMTహెడ్డింగ్ చూసి 50 కోట్లు పెట్టి సినిమా తీయకపోతే ఇంకెందుకు? 100 కోట్లు..200 కోట్లు..500 కోట్లు..1000 కోట్లు అంటూ బడ్జెట్ పీక్స్ కి చేరుతుంటే? 50 కోట్లు కూడా పెట్టకుండా సినిమా ఎలా అవుతుంది? అనుకోవడం సహజం. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. 50 కోట్లు అనేది సినిమా బడ్జెట్ కాదు. కేవలం ప్రీ ప్రొడక్షన్ పనులకు మాత్రమే 50 కోట్లు అవుతుందని ఓ దర్శకుడు చెప్పేసరికి ఆ నిర్మాతకి దిమ్మతిరిగి బొమ్మ కనపడినంత పనైందిట. అవును ఈ కారణంగా ఓ సినిమా ఆగిపోయింది అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ స్టార్ హీరోతో కోలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆ హీరో చేస్తోన్న సినిమా పూర్తయిన వెంటనే ఆ సినిమానే పట్టాలెక్కాలి. కానీ దర్శకుడి ఇచ్చిన షాక్ తో నిర్మాత నా వల్ల కాదు బాబోయ్ అంటూ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడుట. ఈ ముగ్గురి కాంబినేషన్ లో గత ఏడాదే సినిమా అనుకున్నారు. కానీ ఇంత కాలం డిలే అయింది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జూన్...జులై లో పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకున్నారుట.
అయితే దర్శకుడు మధ్యలో ప్రీ ప్రొడక్షన్ కి 50 కోట్లు ఖర్చు అవుతుందని...అదంతా సినిమా పర్పెక్షన్ కోసమే పెట్టాలని...సినిమా సెట్స్ కి వెళ్లిన తర్వాత బడ్జెట్ వేరే ఉందని..అందుకు మరో 100 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని చెప్పాడుట. సినిమాకి అవసరమైన 100 కోట్లు పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రీ ప్రొడక్షన్ కి 50 కోట్లు పెట్టనని..20 కోట్లు మాత్రమే కేటాయిస్తానని అన్నాడుట. ఈ ప్రపోజల్ దర్శకుడికి నచ్చలేదుట. ఈ విషయంలో హీరో కూడా నిర్మాత వైపే నిలబడ్డాడుట.
బడ్జెట్ ఓవర్ ది బోర్డ్ అవుతుందని... అతడితో సినిమా క్యాన్సిల్ చేసుకోవడమే బెటర్ అని హీరో కూడా నిర్మాతకు చెప్పడంతో మరో ఆలోచన లేకుండా సినిమా ఆపేసినట్లు వెలుగులోకి వచ్చింది. అదే 150 కోట్ల బడ్జెట్ తో రెండు మంచి కంటెంట్ తో సినిమాలు చేయోచ్చని హీరో నిర్మాతకి భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. అంతేగా శంకర్..రాజమౌళి లాంటి వారే ప్రీ ప్రొడక్షన్ లకు అన్ని కోట్లు ఖర్చు పెట్టరు. శంకర్ ని పక్కనబెడితే రాజమౌళి ఖర్చు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. పెట్టిన ప్రతీ రూపాయికి దర్శకుడే బాధ్యత తీసుకోవాలి అన్నది ఆయన నైజం. అందుకే గొప్ప గొప్ప సినిమాలు తీయగలుగుతున్నారు.