ఆ నిర్మాత ఓపెన్ గా అడగలేకపోతున్నారా?
సినిమా చేయండని నోరు తెరిచి అడగాలంటే మోహమాటం అడ్డొస్తుంది. వాస్తవానికి ఆయన ఓపెన్ గా అడిగితే కాదనరు.
By: Tupaki Desk | 12 Aug 2023 11:26 AM GMTఇండస్ట్రీలో అతనో పేరున్న నిర్మాత. తమ నిర్మాణ సంస్థ ద్వారా ఎంతో మంది దర్శకుల్ని పరిచయం చేసారు. ఆ తర్వాత వాళ్లంతా అగ్ర దర్శకులుగానూ ఎదిగారు. ఇలా నటులు..సాంకేతిక నిపుణులు ఎంతో మందికి ఆ సంస్థ..నిర్మాత ఎదుగుదలలో దోహద పడ్డారు. మరి ఇలా ఎదిగిన వారంతా ఆ నిర్మాతకు అండగా ఉంటారా? అంటే అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కొందరు మాత్రమే అవకాశాలు ఇచ్చిన వారిని గుర్తు పెట్టుకుంటారు. ఈ విషయం ఓ సందర్భంలో స్వయంగా ఆ నిర్మాతే అన్నారు.
ఇలా ఇండస్ట్రీలో రకరకాల అనుభవాలు సంపాదించారు. ఇంత అనుభవం ఉన్న చిన్న కుమారుడి విషయంలో మాత్రం ఆ అనుభవం ఏమాత్రం పనిచేయడం లేదు. తనయుడిని పెద్ద స్టార్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ ఫలించలేదు. ఇప్పటికే ఆ సంస్థలో కొన్ని సినిమాలు చేసాడు. ఆ సంస్థలో పనిచేసిన కొత్త దర్శకులంతా పాన్ ఇండియా దర్శకులు కూడా అయ్యారు. కానీ తనయుడు కెరీర్ మాత్రం ముందడుగు పడలేదు. ఆరంభంలో తండ్రి కాస్త ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పుడా పరిస్థితి కనిపించలేదు.
సినిమా చేయండని నోరు తెరిచి అడగాలంటే మోహమాటం అడ్డొస్తుంది. వాస్తవానికి ఆయన ఓపెన్ గా అడిగితే కాదనరు. కానీ వాళ్ల ఇబ్బందుల్ని కూడా గుర్తించి సదరు నిర్మాత కుమారుడితో సినిమా చేయండ ని అడగలేక పోతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తనయుడు ఇతర భాషలపై కూడా ఫోకస్ చేస్తున్నట్లు తెలిసింది. ఖాళీగా ఉండటం కంటే ఏదో భాషలో సినిమా చేస్తే అదో రకమైన అనుభంగా భావించి ఇతర భాషలపైనా దృష్టి పెడుతున్నట్లు తెలిసింది. తండ్రి ఇబ్బందిని కూడా తనయుడు గుర్తించి ఇకపై ఒత్తిడి కూడా తీసుకురాకూడదని నిర్ణయించుకున్నాడుట.
ఇప్పటివరకూ నాయన ఇచ్చి పేరు ప్రఖ్యాతలు చాలు. ఇంకా ఆయన్ని ఈ వయసులో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని భావించి ఇకపై ఏ విషయం పప్పా వద్దకు తీసుకెళ్లకూడదని నిర్ణయించుకున్నాడుట. ఇది మంచి నిర్ణయమే. స్వతంత్రంగా పైకి ఎదగాలనుకోవడం గొప్ప విషయం. పరిశ్రమ కూడా అలాంటి వాళ్లనే గుర్తిస్తుంది. విమర్శలకు ఇలాంటి నిర్ణయాలు పుల్ స్టాప్ పెడుతుంటాయి.