Begin typing your search above and press return to search.

అవార్డు వేడుకలపై సి కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!

సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణాల గురించి మాట్లాడుతూ ఎవరికీ దేని మీద నియంత్రణ లేకుండా పోయింది

By:  Tupaki Desk   |   9 Dec 2023 6:43 AM GMT
అవార్డు వేడుకలపై సి కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ అవార్డు వేడుకలపై తన కామెంట్ వినిపించారు. ఒకప్పుడు అవార్డు వేడుక అంటే అందరు కలిసి దాన్నొక పండుగలా జరుపుకునే వారు. అందరు అవార్డు వేడుకకు హాజరయ్యే వారు. కానీ ఇప్పుడు కేవలం అవార్డు వచ్చిన వారు తప్ప మిగతా వారంతా కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవార్డు వేడుకలు ఎందుకనే ప్రశ్న కూడా వస్తుందని అన్నారు సి కళ్యాణ్. పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు సి కళ్యాణ్. సినిమా నిర్మాణం, అవార్డుల గురించి ఆయన కామెంట్ చేశారు.

సినిమా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణాల గురించి మాట్లాడుతూ ఎవరికీ దేని మీద నియంత్రణ లేకుండా పోయింది. కొన్నాళ్లు సినిమాలు ఆపి పెద్ద సినిమాల్లో డబ్బు ఎక్కడ వృధా అవుతుంది అన్నది గమనించారు కానీ అలా చేస్తే సినిమాలు తీసే పరిస్థితి ఉండదని మళ్లీ ఎప్పటిలానే కొనసాగిస్తున్నారు. హిందీలో ఎంత పెద్ద సినిమా అయినా 60 రోజుల్లో పూర్తవుతుంది. ఇక్కడ అలాంటి వ్యవస్థ ఏమి లేదని అన్నారు సి కళ్యాణ్.

బాలకృష్ణతో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు కళ్యాణ్. బాలయ్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక మా సినిమా ఉంటుందని అన్నారు. ఇక ఈ టైం లో కొన్ని చిన్న సినిమాలు చేయూచ్చు. కానీ ప్రస్తుతం తన దృష్టంతా కూడా చెన్నైలో ఏర్పాటు చేస్తున్న కళ్యాణ్ అమ్యూజ్ మెంట్ పార్క్ మీద ఉందని అన్నారు. తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. తమిళ సంవత్సరాది సందర్భంగా అది ప్రారంభించాలని చూస్తున్నాం అన్నారు. ఇండియాలో తొలిసారి స్కై థియేటర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు సి.కళ్యాణ్.

ఇక సినీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించినంత సపోర్ట్ మరే ప్రభుత్వం అందివ్వలేదు. తెలంగాణలో నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ పరిశ్రమ తరపున త్వరలో వెళ్లి కలుస్తాం. హైదరాబాద్ లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరగడం లేదు. దాన్ని మళ్లీ స్టార్ట్ చేస్తే మంచి గుర్తింపు వస్తుంది. వీటితో పాటుగా బాలల చలన చిత్రోత్సవాలను కూడా హైదరాబాద్ కు తీసుకు రమ్మని రేవంత్ రెడ్డిని కోరతామని అన్నారు సి కళ్యాణ్. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా అన్ని విధాలుగా సాయం అందిస్తామని చెప్పారని కళ్యాణ్ ప్రస్తావించారు.