రత్నం సార్ బ్యాక్ టు ఫ్యామ్..!
తెలుగు మరియు తమిళ సినీ ప్రేక్షకులకు ఏఎం రత్నం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
By: Tupaki Desk | 4 May 2024 7:08 AM GMTతెలుగు మరియు తమిళ సినీ ప్రేక్షకులకు ఏఎం రత్నం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది స్టార్స్ మరియు సూపర్ స్టార్స్ తో సినిమాలు నిర్మించిన ఏఎం రత్నం గత కొంత కాలంగా సైలెంట్ అయ్యాడు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇతర విషయాల కారణంగా నిర్మాణంకు కొన్నాళ్లు దూరం అయ్యాడు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో పాటు, సన్నిహితుల వెన్నుదన్నుతో నిర్మాణంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా రంగం పై ఏఎం రత్నంకు ఉన్న ప్రేమ అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉన్నది అంతా కూడా ప్రస్తుతం పవన్ తో నిర్మిస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల కారణంగా హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం అవుతోంది. దాంతో రత్నం గారి ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఇలాంటి సమయంలో ఈయన నిర్మించిన గిల్లీ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేయడం జరిగింది.
ఇప్పటి వరకు ఏ సౌత్ మూవీ కూడా రీ రిలీజ్ లో దక్కించుకోని రికార్డ్ స్థాయి వసూళ్లను గిల్లీ దక్కించుకుంది. బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా రూ.30 కోట్ల రూపాయలను గిల్లీ మూవీ దక్కించుకుంది. దాంతో నిర్మాత ఏఎం రత్నం ఫుల్ జోష్ లో ఉన్నాడు.
ఇదే సమయంలో హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి ఏంటి... క్రిష్ వదిలేశాడు, పవన్ రాజకీయంగా బిజీగా ఉన్నాడు అనుకుంటున్న సమయంలో జ్యోతి కృష్ణ బాధ్యతలు చేపట్టాడు. మిగిలి ఉన్న సినిమాను జ్యోతి కృష్ణ కచ్చితంగా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీస్తాడు అనేందుకు సాక్ష్యంగా తాజాగా విడుదల అయిన టీజర్ నిలిచింది.
గిల్లీకి రూ.30 కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం తో పాటు హరి హర వీరమల్లు టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఏఎం రత్నం నిర్మాతగా బ్యాక్ టు ఫామ్ ఖాయం అనిపిస్తుంది. అభిరుచి ఉన్న నిర్మాత అయిన రత్నం సార్ ముందు ముందు మరిన్ని సూపర్ హిట్ సినిమాలను నిర్మించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.