నిర్మాతల మండలి వెనక్కి తగ్గుతున్నట్లుందే?
దీంతో నిర్మాతల మండలి- నడిగర్ మధ్య తీవ్ర వాదనే చోటు చేసుకునేలా వాతావరణం కనిపించింది.
By: Tupaki Desk | 3 Aug 2024 1:28 PM GMTతమిళ నిర్మాత మండలి తీసుకున్న నిర్ణయాలపై నడిగర్ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నటుడు ధనుష్ పై తీసుకున్న నిర్ణయంతో నడిగార్ షాక్ అయి మండలి నిర్ణయాన్ని తోసి పుచ్చింది. ఈ హక్కు మీకు ఎక్కడిది? అంటూ నడిగర్ అధ్యక్షుడు నాజర్ అసహనాన్ని వ్యక్తం చేసారు. దీంతో నిర్మాతల మండలి- నడిగర్ మధ్య తీవ్ర వాదనే చోటు చేసుకునేలా వాతావరణం కనిపించింది.
నిర్మాతల మండలికి తోడుగు పంపిణీ సంఘం, థియేటర్ల సంఘం కూడా మద్దతు ప్రకటించడంతో? సీన్ మరింత వెడెక్కింది. దీంతో ధనుష్ విషయం సహా షూటింగ్ ల బంద్ విషయంలో నిర్మాతల మండలి సీరియస్ గా ఉంటుందనే వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ధనుష్ విషయంలో నిర్మాతల మండలి వెనకడుగు వేసినట్లు కనిపిస్తుంది. ధనుష్ పై ఎలాటి ఫిర్యాదులు లేవని భారత నటీనటుల సంఘం పేర్కొనడం అవాస్తవమని చెబుతూనే ఏడాదిన్నర క్రితం జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసింది.
నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో నిర్మాతలకు నష్టం కలిగించిన ఐదుగురు నటుల గురించి తీర్మానం చేసి దాన్ని నడిగర్ సంఘానికి పంపినా పట్టించుకోకపోవడంతో పాటు, ఎలాంటి చర్యలకు దిగకపోవడంతోనే కఠిన నిర్ణయాలు తీసుకున్నామని నిర్మాతల మండలి వివరణ ఇచ్చింది. తమకి నడిఘర్ సంఘం అన్నిరకాలుగా సహకరిస్తుందని, వాళ్లతో మంచి సత్స సంబంధాలున్నాయని పేర్కొంది.
దీంతో నిర్మాతల మండలి- నడిగర్ సంఘంతో మరోసారి భేటీ అవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 లోపు ఈ భేటి అవసరం. 15 తర్వాత కొత్త సినిమాలకు అనుమతి లేని నేపథ్యంలో భేటీ వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి అన్ని సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు వేయాలని నిర్మాతల మండలి భావిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.