ఎన్నికల వేడి.. నిర్మాతలందరిది ఒకే టెన్షన్
సినిమా డేట్స్ కి ఎన్నికల షెడ్యూల్ తో క్లాస్ రాకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ డేట్స్ ఎనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాలని భావిస్తున్నారు
By: Tupaki Desk | 9 March 2024 4:07 AM GMTదేశంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి ప్రస్తుతం నడుస్తోంది. అలాగే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల మూడ్ ఉంది. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన పార్లెమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అన్ని పార్టీలు వారి వారి వ్యూహాలతో, ప్రచార కార్యక్రమాలతో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నంలో ఉన్నాయి. మరో వైవు సినిమాల దర్శక నిర్మాతలు ఈ ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు.
సినిమా డేట్స్ కి ఎన్నికల షెడ్యూల్ తో క్లాస్ రాకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ డేట్స్ ఎనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాలని భావిస్తున్నారు. ప్రజలు ఎలక్షన్ మూడ్ లోకి వెళ్ళిపోతే ఇక సినిమాలు రిలీజ్ అయిన పెద్ద ఫోకస్ చేయరు. రాజకీయ వాతావరణంలో ప్రజలందరూ ఉంటారు. అలాగే మీడియా ఫోకస్ అంతా కూడా రాజకీయాలపైనే ఫోకస్ చేస్తాయి.
ఇలాంటి సమయంలో పెద్ద సినిమాలు రిలీజ్ చేసిన ప్రయోజనం ఉండదు అని నిర్మాతలకి తెలుసు. ఐదేళ్లకి ఒకసారి వచ్చే ఈ ఎన్నికలు ప్రజలని ఎక్కువ ఆకర్షిస్తాయి. అందుకే సినిమాల రిలీజ్ డేట్స్ ఎన్నికల సమయంలో పెట్టుకోరు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలుకానుంది. ఈ నెలలోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది.
శంకర్ ఇండియన్ 2 మూవీని ఏప్రిల్, మే నెలల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఎలక్షన్ డేట్స్ తో క్లాస్ రాకుండా ఉండాలంటే నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే విక్రమ్ తంగళాన్ రిలీజ్ డేట్ కూడా హోల్డ్ లో పెట్టారు. తెలుగులో అయితే స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. ఎలక్షన్ డేట్స్ కంటే ముందుగానే ఈ సినిమా రిలీజ్ అయిపోనుంది.
చిన్న సినిమాలు, మీడియా రేంజ్ మూవీస్ కూడా ఎన్నికల డేట్స్ కి సంబందించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకుందామని వెయిటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏప్రిల్, మే నెలలో ఈ ఎలక్షన్ మూడ్ కారణంగా సినిమా సందడి కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.