Begin typing your search above and press return to search.

వెళ్లిపోకే 'శ్యామల'.. నిర్మాత SKN పోస్ట్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నిర్మాత శ్రీనివాస కుమార్.

By:  Tupaki Desk   |   4 Jun 2024 6:42 AM GMT
వెళ్లిపోకే శ్యామల.. నిర్మాత SKN పోస్ట్ వైరల్
X

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నిర్మాత శ్రీనివాస కుమార్. అయితే శ్రీనివాస కుమార్ కన్నా ఎస్కేఎన్ అంటే త్వరగా అందరూ గుర్తుపడతారు. గత ఏడాది బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎస్కేఎన్ మారిన విషయం తెలిసిందే. అంతకుముందు తెలుగులో పలు సినిమాలు చేసినా.. బేబీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. వరుస సినిమాలను లైన్ లో పెట్టేశారు.

ప్రస్తుతం బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు ఎస్కేఎన్. సాయి రాజేష్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. బేబీ హీరో హీరోయిన్లతో మరో సినిమా కూడా ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి సాయి రాజేష్ కథ అందిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ గా సుమన్ పాతూరిని ఇంట్రడ్యూస్ చేయనున్నారు ఎస్కేఎన్.

అయితే ఎస్కేఎన్ లేటెస్ట్ పోస్ట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ హీరో నితిన్ అఆ సినిమాలోని వెళ్లిపోకే శ్యామల వీడియో సాంగ్ ను ట్వీట్ చేశారు. వెళ్లిపోకే శ్యామల ఏమి బాగా లేదు లోపల అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఎస్కేఎన్ పోస్ట్ పై జోరుగా చర్చ జరుగుతోంది. పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ వేళ యాంకర్ శ్యామలను ఉద్దేశించే ఎస్కేఎన్ ఈ ట్వీట్ చేశారని కొందరు చెబుతున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్కేఎన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు. పిఠాపురంలో పర్యటించి ప్రచారం కూడా చేశారు. స్థానికుల ఇళ్లకు వెళ్లి పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎస్కేఎన్ తోపాటు టాలీవుడ్ కు చెందిన అనేక మంది జనసేనానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటించారు. నాగవంశీ తో పాటు మెగా హీరోలంతా రంగంలోకి దిగారు. అనేక మంది సెలబ్రిటీలు నెట్టింట పోస్టులు పెట్టారు.

అదే సమయంలో యాంకర్ శ్యామల.. వైసీపీకి మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసింది. ఇటీవల పవన్ గురించి సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. రాజకీయాలంటే ఆవేశం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు, రాజకీయాలు అంటే సాయం చేయడమని అనింది. దీంతో ఆమె వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఎస్కేఎన్ కూడా శ్యామలను ఉద్దేశించే పోస్ట్ చేశారని అంతా అంటున్నారు.