మీడియాపై నిర్మాతల సంఘం వేటు!
ఈ మేరకు నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజా ఓ ప్రకటన జారీ చేసారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే ఈ సమాజంలో తమ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని కోరారు. ఒక
By: Tupaki Desk | 22 Sep 2023 6:59 AM GMTవిజయ్ ఆంటోనీ కుమార్తె మీరా మృతి నేపథ్యంలో కోలీవుడ్ మీడియా అత్యుత్సాహం ఎంతటి విమర్శలకు దారి తీసిందో తెలిసిందే. అంత్యక్రియల సమయంలో దుఖంతో నిండిన కుటుంబ సభ్యుల్ని మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నించడం.. మైకులు పట్టుకుని మీద మీద కి ఎగబాకడం వంటి సన్నివేశాల్లో తీవ్ర విమర్శలకు దారి తీసాయి. పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబాన్ని వాదార్చాల్సింది పోయి ఇబ్బందికర ప్రశ్నలతో మరింత క్షోభకు గురిచేసారు.
ఇందులో ప్రముఖ యూ ట్యూబ్ ఛానెల్స్...టీవీ ఛానెల్స్..పత్రికలు ఉండటం విశేషం. ఇక వాటిని ఆధారంగా చేసుకుని యూ ట్యూబ్ లో ఇష్టానుసారం పోటీ పడి మరీ తంబ్ నైల్స్ పెట్టి ప్రచారం చేసిన భాగోతం తెలిసిందే. దీంతో నిర్మాతల సంఘం మీడియాపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియాని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై తమిళ సినీ ప్రముఖుల మరణ దృశ్యాలు..వార్తలకు సంబంధించిన అంశంపై అనుమతించేది లేదని ప్రకటించింది.
ఈ మేరకు నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజా ఓ ప్రకటన జారీ చేసారు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే ఈ సమాజంలో తమ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని కోరారు. ఒక వ్యక్తి చనిపోతే ఎక్కువ నష్టం ఆ కుటుంబానికే ఉంటుందని..మిగతా వారంతా పరామర్శకి వచ్చి వెళ్లే వారు తప్ప! వాళ్లు చేసేదేం లేదని..మీడియా కవరేజీ కోసం ఎగబడిన తీరు శోచనీయం అని అన్నారు. ఇలాంటి సమయంలో మీడియాకి అసలు సంబంధం ఏముంది? విషయం తెలిసిన తర్వాత దాన్ని ప్రజలకు చేరే వేయడమే పని.
కానీ అంతకు మించి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇది తగదు. మీడియాకి పోలీసుల అనుమతి ఉన్నా సరే ఇకపై అనుతమించేది లేదని మీడియా వారంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిం చాలని సూచించారు. దీంతో కోలీవుడ్ మీడియాకి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.
మీరా విషయంలో కోలీవుడ్ మీడియా అతిపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తాయి. అంత్యక్రియుల సమయంలో పార్ధీవదేహం కంటే ముందే మీడియా స్పాట్ కి చేరుకుని కవరేజ్ చేయడంపై సర్వత్రా విమర్శలు తెరపైకి వచ్చాయి. అలాగే అంతకు ముందు పలువురు నటీనటుల విషయంలోనే ఇలాగే జరగడంతో నిర్మాతల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.