Begin typing your search above and press return to search.

భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ షాక్ ఇచ్చిన నిర్మాత‌లు!

ఇందులో హీరో అక్క పాత్ర‌లో స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని విగ్నేష్ శివ‌న్ కిందా మీదా పడి న‌య‌న‌తార‌ని ఒప్పించాడు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 12:14 PM GMT
భార్యాభ‌ర్త‌లిద్ద‌రికీ షాక్ ఇచ్చిన నిర్మాత‌లు!
X

న‌య‌న‌తార‌-విగ్నేష్ శిన్ కి చిత్ర నిర్మాత‌లు షాక్ ఇచ్చారా? ఇద్ద‌రు ఒక‌ట‌నుకుంటే అక్క‌డ మ‌రో ర‌క‌మైన స‌న్నివేశం ఎదురైందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం విగ్నేష్ శివ‌న్ `ల‌వ్ టుడే` ఫేం ప్ర‌దీప్ రంగ‌నాధ్ హీరోగా 'ఎల్ ఐ సీ' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరో అక్క పాత్ర‌లో స్టార్ హీరోయిన్ అయితే బాగుంటుందని విగ్నేష్ శివ‌న్ కిందా మీదా పడి న‌య‌న‌తార‌ని ఒప్పించాడు.

ఆమె కూడా భ‌ర్త అడ‌గడంతో త‌న ఇమేజ్ ని సైతం పక్క‌న‌బెట్టి ఒప్పుకుంది. త్వ‌ర‌లో సెట్స్ కి కూడా వెళ్ల‌డానికి రెడీ అవుతోంది. అయితే ఇంత‌లోనే చిత్ర నిర్మాత‌ల‌కు న‌య‌న‌తార‌కి షాక్ ఇచ్చారుట‌. న‌య‌న తార తీసుకునే పారితోషికాన్ని తాము ఇవ్వ‌లేమ‌ని మ‌రో న‌టిని తీసుకోమ‌ని విగ్నేష్ కి సూచించారుట‌. తొలు త నిర్మాత‌లు ద‌ర్శ‌కుడి కండీష‌న్ కి ఒప్పుకున్నాకే న‌య‌న్ తో మాట్లాడ‌టం జ‌రిగిందిట‌.

కానీ సినిమా బడ్జెట్..న‌య‌న తార‌కి ఇచ్చే పారితోషికం లెక్క గ‌ట్టి చూస్తే బ్యాలెన్స్ అవ్వ‌డం లేదుట‌. ఆమెకిచ్చే స‌గం పారితోషికంతోనే సినిమా పూర్తవుతుంద‌ని...ఆ రేంజ్ హీరోయిన్ ఎందుకని పున‌రాలో చ‌న‌లో ప‌డ్డారుట‌. ఈ నేప‌థ్యంలో న‌య‌న్ ఎంట్రీ సందిగ్గంలో ప‌డిన‌ట్లు తెలుస్తుంది. న‌య‌న‌తార ఒక్కో సినిమాకి ప‌దికోట్లు తీసుకుంటుంది. ఈ సినిమా బ‌డ్జెట్ ఐదారు కోట్లు మించ‌డం లేదు.

కానీ 'ఎల్ ఐసీ' సినిమాకి భ‌ర్త ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో ఐదు కోట్ల‌కే న‌య‌న్ ఒప్పుకుందిట‌. కానీ ఇప్పుడా పారితోషికం కూడా నిర్మాత‌లు ఇవ్వ‌డానికి ముందుకు రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంలో విగ్నేష్ శివ‌న్ నిర్మాత‌ల‌పై ఆసంతృప్తిగానూ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యం ముందుగానే చెబితే ఇంత‌వ‌ర‌కూ వ‌చ్చేది కాద‌ని...న‌య‌నతార కాక‌పోతే మ‌రో హీరోయిన్ చూసుకునే వాళ్ల‌మ‌ని నిర్మాత‌ల ముందు ఆవేద‌న చెందిన‌ట్లు స‌మాచారం.