దిల్ రాజు కమిట్మెంట్ అంటే ఇదే..!
సినిమా కథ ఓకే చేసినప్పటి నుంచి రిలీజయ్యేంత వరకు దిల్ రాజు ఇచ్చే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు.
By: Tupaki Desk | 7 April 2024 12:55 PM GMTఒక సినిమా నిర్మించడం అంటే కేవలం డబ్బులు పెడితే సరిపోతుంది మిగతా అంతా ఆ టీం చూసుకుంటుందని అనుకునే వారు ఉన్నారు. కానీ కొందరు నిర్మాతలు మాత్రం డబ్బులు పెట్టేది తాము కాబట్టి సినిమా మొదలైన నాటి నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రతి క్షణం చూసుకుంటారు. అలాంటి నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. సినిమా కథ ఓకే చేసినప్పటి నుంచి రిలీజయ్యేంత వరకు దిల్ రాజు ఇచ్చే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. కమర్షియల్ సినిమాల విషయంలో తన ప్రమేయం తెలియకపోవచ్చు కానీ మీడియం రేంజ్ బడ్జెట్, లో బడ్జెట్ సినిమాలకు మాత్రం దిల్ రాజు మార్క్ ప్రమోషన్స్ చేస్తుంటాడు.
దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ సినిమాకు కూడా దిల్ రాజు తన మార్క్ ప్రమోషన్స్ చేస్తున్నారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా టాక్ అంత గొప్పగా లేకపోయినా సరే దిల్ రాజు ఈ సినిమాను ఆడియన్స్ లో ఎక్కించాలనే ప్రయత్నం చూసి అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు. నిర్మాత అయ్యుండి ఒక రిపోర్టర్ గా మారి మైక్ పట్టుకుని ఫ్యామిలీ స్టార్ పబ్లిక్ టాక్ అడిగి తెలుసుకున్నారు.
ఇలా ఒక నిర్మాత స్వయంగా ఆడియన్స్ దగ్గర మైక్ పట్టుకుని అడగడం దిల్ రాజుకే చెల్లింది. తీసిన సినిమా ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టడమే కాదు దానికి మించి ఏవైనా చేయొచ్చు అన్నది దిల్ రాజుని చూస్తే అర్ధమవుతుంది. రాబోతున్న ఉగాది, రంజాన్ ఫెస్టివల్ ని క్యాష్ చేసుకోవాలనే ప్లాన్ తో ఉన్న ఫ్యామిలీ స్టార్ టీం ఈ ప్రమోషన్స్ సినిమాకు ఎంత వరకు హెల్ప్ అవుతాయన్నది చూడాలి.
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మరో గీతా గోవిందం అవుతుందని అనుకుంటే అది అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. అయితే మేకర్స్ మాత్రం సినిమాను ఇంకా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. దిల్ రాజు అయితే ఏకంగా సినిమా గురించి వాళ్లు వీళ్లు కాదు అసలు సినిమా చూసిన పబ్లిక్ టాక్ ఏమనుకుంటున్నారు అన్నది తెలుసుకోవాలని ఆయనే మైక్ పట్టుకుని జనాల్లోకి వెళ్లారు. ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు స్పెషల్ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. సినిమా పట్ల దిల్ రాజుకి ఉన్న కమిట్మెంట్ ఎలాంటిదో మరోసారి ప్రూవ్ అయ్యింది. మరి దిల్ రాజు తరహాలో రాబోయే రోజుల్లో నిర్మాతలు మైక్ పట్టుకుని రివ్యూ అడిగే ట్రెండ్ వస్తుందేమో చూడాలి.