Begin typing your search above and press return to search.

స్టార్ వార్స్ నుండి ప్రాజెక్ట్ K వరకు DUNE స్ఫూర్తి

ఇప్పుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న ప్రాజెక్ట్ K చిత్రానికి ఇదే న‌వ‌ల‌ స్ఫూర్తి అని విశ్లేషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 July 2023 3:11 PM GMT
స్టార్ వార్స్ నుండి ప్రాజెక్ట్ K వరకు DUNE స్ఫూర్తి
X

సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌ల‌తో తెర‌కెక్కిన చాలా సినిమాలు ఎంతో గొప్ప‌ అల‌రించాయి. ఊహాతీత‌మైన‌ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఎన్నో క‌ల్పిత అంశాల‌ను సినిమాలో చూపించినా కానీ ప్ర‌జ‌లు ఆద‌రించారు. ముఖ్యంగా హాలీవుడ్ లో సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌ల‌తో ఎన్నో ప్ర‌యోగాల‌ను చూశాం. అయితే ప్ర‌పంచ దేశాల్లో రూపొందిన చాలా సినిమాల‌కు `డూన్` న‌వ‌ల ఎంతో స్ఫూర్తిగా నిలిచింద‌నేది విశ్లేష‌కుల మాట‌.

డూన్ న‌వ‌ల స్ఫూర్తితోనే డూన్ (2021 రిలీజ్) సినిమా కూడా తెర‌కెక్కింది. డూన్ - మ్యాడ్ మ్యాక్స్ లాంటి సినిమాలు డిస్టోపియన్ ఫ్యూచర్స్.. ధ్వంసమైన పర్యావరణం.. అణచివేత పాలకుల క‌థ‌ల‌తో రూపొందాయి. మనుగడ కోసం మానవుని పోరాటాన్ని ఈ సినిమాల్లో చూపించారు.

హెర్బర్ట్ నవల `డూన్` మొదటిసారిగా 1965లో ప్రచురిత‌మైంది. స్టార్ వార్స్ - మ్యాడ్ మాక్స్ స‌హా ఎన్నో సినిమాలకు ఈ న‌వ‌ల స్ఫూర్తి. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న ప్రాజెక్ట్ K చిత్రానికి ఇదే న‌వ‌ల‌ స్ఫూర్తి అని విశ్లేషిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా భారీ సైన్స్ ఫిక్ష‌న్ ఫ్రాంఛైజీ చిత్రాల‌కు ప్రేరణనిచ్చింది డూన్ న‌వ‌ల. అందుకే ఇప్పుడు ప్రాజెక్ట్ కేతో ముడిపెట్టి అభిమానులు విశ్లేషిస్తున్నారు.

ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` పోస్టర్ `ఐరన్ మ్యాన్`తో పోలి ఉంది. దీపికా పదుకొణె పోస్టర్ జెండాయా పాత్ర‌తో పోలికను క‌లిగి ఉంది. డూన్ ఇంకా చాలా చిత్రాలకు స్ఫూర్తినిచ్చింది. డూన్ న‌వ‌ల స్ఫూర్తితో `ఏలియన్` ఫ్రాంఛైజీనే ఆవిర్భ‌వించింది. పొడ‌వాటి పుర్రె పోలికతో ఏలియ‌న్ విన్యాసాలను ఇందులో చూపించ‌గా ప్ర‌జ‌ల‌కు అవి న‌చ్చాయి.

స్టాన్లీ కుబ్రిక్ `2001: ఎ స్పేస్ ఒడిస్సీ` డ్యూన్ నవల ప్ర‌చురిత‌మైన‌ కేవలం మూడు సంవత్సరాల తర్వాత విడుదలైంది. దాని సెరిబ్రల్ సైన్స్ ఫిక్షన్.. సైకెడెలిక్ అంశాలతో స‌రిపోలిన విష‌యాలు సినిమాలో క‌నిపించాయి. 1965లో ప్రచురించిన‌ హెర్బర్ట్ `డ్యూన్` నవలల నుండి `స్టార్ వార్స్` ప్రేరణ పొందింది. భ‌విష్య‌త్ కాలంలోకి ప్ర‌యాణించి అక్క‌డ జీవించే మానవుడి జీవ‌న వ్య‌త్సాసంపై ఊహాజ‌నిత‌మైన క‌థ‌తో ప్రాజెక్ట్.కే రూపొందుతోంది.